నాలుగో రోజూ నష్టాలే..
ABN , Publish Date - Sep 04 , 2026 | 01:50 AM
దేశీయ ఈక్విటీ బెంచ్‌మార్క్ సూచీలు వరుసగా నాలుగో రోజూ నష్టాలతోనే ముగిశాయి.
ముంబై: దేశీయ ఈక్విటీ బెంచ్‌మార్క్ సూచీలు వరుసగా నాలుగో రోజూ నష్టాలతోనే ముగిశాయి. గురువారం ఆరంభంలో లాభాలతో మొదలైన బీఎ్‌సఈ సెన్సెక్స్ 417.49పాయింట్ల నష్టంతో 76,152.86వద్ద, ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ 41 పాయింట్లు కోల్పోయి 23,873.45 వద్ద క్లోజయ్యాయి.
ట్రాన్స్‌ఫార్మర్ల తయారీ సంస్థ కనోహర్ ఎలక్ర్టికల్స్ ఐపీఓ ఈ నెల 8న ప్రారంభమై 10న ముగియనుంది. ఒక్కో షేరు ధరను రూ.601-632గా నిర్ణయించారు.
స్పెషాలిటీ కెమికల్స్ మాన్యుఫ్యాక్చరర్ ప్రసోల్ కెమికల్స్ రూ.500 కోట్ల పబ్లిక్ ఇష్యూ ఈ నెల 8న ప్రారంభమై 10న ముగియనుంది. ఒక్కో షేరు ధరల శ్రేణిని రూ.643-676గా కంపెనీ నిర్ణయించింది.
గ్లాస్‌వాల్ సిస్టమ్స్ రూ.428 కోట్ల ఐపీఓ కూడా ఈ నెల 8న ప్రారంభమై 10న ముగియనుంది. ఐపీఓలో ఒక్కో షేరు ప్రైస్‌బ్యాండ్‌ను రూ.172-182గా ఖరారు చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎన్‌విడియా గూటికి హగ్గింగ్ ఫేస్ స్టార్టప్
పాత కంప్యూటర్ల కోసం జియోపీసీ
Read Latest Telangana News And AP News And National News
And Telugu News