Share News

ఎనర్జీ, ఎఫ్‌ఎంసీజీ రంగాలపై ఒత్తిడి!

ABN , Publish Date - Aug 31 , 2026 | 03:14 AM

గత వారం స్వల్ప ఊగిసలాటల మధ్య నిఫ్టీ 24,150 -24,350 శ్రేణిలో, సెన్సెక్స్‌ 77,250-77,650 శ్రేణిలో కదలాడాయి. ఈ వారం మార్కెట్లు కీలక ట్రిగ్గర్లపై దృష్టి సారిం చనున్నాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలు...

ఎనర్జీ, ఎఫ్‌ఎంసీజీ రంగాలపై ఒత్తిడి!

గత వారం స్వల్ప ఊగిసలాటల మధ్య నిఫ్టీ 24,150 -24,350 శ్రేణిలో, సెన్సెక్స్‌ 77,250-77,650 శ్రేణిలో కదలాడాయి. ఈ వారం మార్కెట్లు కీలక ట్రిగ్గర్లపై దృష్టి సారిం చనున్నాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, క్రూడాయిల్‌ ధరలు, యూఎస్‌ ఫెడ్‌ సంకేతాలు, విదేశీ నిధుల ప్రవా హం దిశానిర్దేశం చేయనున్నాయి. సాంకేతికంగా నిఫ్టీకి 24,100 కీలక మద్దతు స్థాయిగా ఉండగా 24,250 నిరోధ స్థాయిగా ఉండనుంది. యూఎస్‌ మార్కెట్ల మద్దతుతో ఐటీ, ఆటో, ప్రైవేట్‌ బ్యాంకులు సానుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఎనర్జీ, ఎఫ్‌ఎంసీజీ రంగాల్లో మాత్రం ఒత్తిడి కొనసాగవచ్చు.

స్టాక్‌ రికమండేషన్స్‌

ఆస్క్‌ ఆటోమోటివ్‌: ఐపీఓ ఆరంభం నుంచి ఈ కౌంటర్‌ దూకుడుగా సాగుతోంది. మంచి బేస్‌ తర్వాత జీవితకాల గరిష్ఠానికి చేరాక 12 శాతం మేర స్వల్ప కరెక్షన్‌ నమోదైంది. ఈ పుల్‌బ్యాక్‌ సమయంలో వాల్యూమ్‌ ఎక్కువగా లేకపోవటం, స్వల్పకాల మూవింగ్‌ యావరేజీ వద్ద మద్దతు తీసుకోవటం సానుకూల అంశాలు. గత శుక్రవారం రూ.633 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.620 శ్రేణిలో ఎంటరై రూ.700 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.600 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

క్యాప్రి గ్లోబల్‌: రెండేళ్ల బ్రేస్‌ బ్రేకౌట్‌ తర్వాత ఈ షేరు జోరును ప్రదర్శిస్తోంది. కప్‌ అండ్‌ హ్యాండిల్‌ ఫార్మేషన్‌ కనిపిస్తోంది. కీలకమైన రూ.260 నిరోధ స్థాయిని దాటితే మరింత దూకుడుగా ముందుకు వెళ్లే అవకాశం ఉంది. పెరుగుతున్న వాల్యూమ్‌ దీన్నే సూచిస్తోంది. గత శుక్రవారం రూ.258 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లోకి ఇన్వెస్టర్లు రూ.240 శ్రేణిలో ప్రవేశించి రూ.290 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.220 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

లాయిడ్‌ మెటల్స్‌: ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఆగస్టు మొదటి వారం వరకు ఈ షేరు 110 శాతం రాబడిని అందించింది. అయితే రూ.2,100 వద్ద జీవితకాల గరిష్ఠాన్ని తాకిన తర్వాత 15 శాతం వరకు దిద్దుబాటుకు లోనైంది. రిలేటివ్‌ స్ట్రెంత్‌ మెరుగ్గానే ఉంది. గత శుక్రవారం రూ.1,810 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో రూ.1,800 స్థాయిలో పొజిషన్‌ తీసుకుని రూ.1,950/ 2,000 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.1,770 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

హీరో మోటో: కొన్ని నెలలుగా ఈ షేరు పరిమిత శ్రేణిలో పయనిస్తోంది. ఆగస్టు తొలి రెండు వారాల్లో కాస్త మూమెంటమ్‌ కనిపించినా మళ్లీ కొంత కరెక్షన్‌కు లోనైంది. మళ్లీ స్వల్పకాల మూవింగ్‌ యావరేజేసెస్‌ వద్ద పుంజుకునే అవకాశం కనిపిస్తోంది. గత శుక్రవారం రూ.5,600 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.5,570 ఎగువన ప్రవేశించి రూ.5,750/5,800 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.5,530 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.


బజాజ్‌ కన్స్యూమర్‌: ఈ ఏడాది మార్చి నుంచి జూలైలో జీవితకాల గరిష్ఠాన్ని తాకే వరకు 350 శాతం రాబడిని ఇచ్చిన ఈ షేరు ప్రస్తుతం 35 శాతం మేర దిద్దుబాటుకు లోనైంది. అయితే 200 రోజుల మూవింగ్‌ యావరేజీ వద్ద మద్దతు తీసుకుని పుంజుకునే అవకాశం కనిపిస్తోంది. ఈపీఎస్‌, అమ్మకాలు మెరుగ్గా ఉండటమే ఇందుకు కారణం. గత శుక్రవారం రూ.477 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.460 శ్రేణిలో ప్రవేశించి రూ.550 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.440 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

మూర్తి నాయుడు పాదం,

మార్కెట్‌ నిపుణులు, నిఫ్టీ మాస్టర్‌

+91 98855 59709

నోట్‌ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి..

బ్యాంకులు, ఆసుపత్రులు, నైట్‌క్లబ్‌లలోనూ పెళ్లి రిజిస్ట్రేషన్.. చైనాలో ఎందుకిలా చేస్తున్నారంటే..

పెళ్లి రద్దు చేశారని దారుణం.. యువతి, ఆమె సోదరిపై యాసిడ్ దాడి..

Updated Date - Aug 31 , 2026 | 03:14 AM