స్థిరంగా కొనసాగుతున్న బంగారం, వెండి ధరలు..
ABN , Publish Date - Nov 22 , 2026 | 10:17 AM
భారీగా తగ్గిన బంగారం ధర.. స్థిరంగా కొనసాగుతోంది. గుడ్ రిటర్న్ వెబ్‌సైట్ ప్రకారం, ఆదివారం ఉదయం 10 గంటలకు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,080గా ఉంది.
ఇంటర్నెట్ డెస్క్: భారీగా తగ్గిన బంగారం ధర.. స్థిరంగా కొనసాగుతోంది. గుడ్ రిటర్న్ వెబ్‌సైట్ ప్రకారం, ఆదివారం ఉదయం 10 గంటలకు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,080గా ఉంది. అలాగే ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,14,650గా ఉంది. ఇక తగ్గిన వెండి ధర స్థిరంగా ఉంది. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర రూ.1.75 లక్షలకు చేరింది.
క్రమక్రమంగా తగ్గుతున్న వెండి ధరలు..
ఇటీవల వరకు భారీగా పెరిగిన వెండి ధర.. క్రమక్రమంగా తగ్గుతూ వస్తుంది. నవంబర్ 13న కిలో వెండి ధర రూ. 1,95,000 ఉంది. నవంబర్ 16న రూ.5 వేలు తగ్గి రూ.1,90,0000గా ఉంది. ఇక నవంబర్ 18న మరో రూ.5 వేలు తగ్గింది. దీంతో ఆ ధర రూ.1,85,000గా ఉంది. నవంబర్ 19న మరో రూ.5 వేలు తగ్గింది. రూ.1,80,000గా ఉంది. నవంబర్ 20న ఇంకో రూ5 వేలు తగ్గింది. దాంతో కిలో వెండి ధర రూ.1,75,000గా ఉంది. నాటి నుంచి అదే ధర కొనసాగుతోంది.
శుభ ముహూర్తాలు..
మరో వైపు నవంబర్ 21 నుంచి శుభ ముహూర్తాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా దాదాపు 50 జంటలు వివాహ వేడుక ద్వారా ఒక్కటి కానున్నాయి. దీంతో లక్షల కోట్లలో వ్యాపారం ఊపందుకోనుంది. అలాంటి వేళ.. బంగారం, వెండికి మంచి డిమాండ్ ఏర్పడనుంది. దీంతో బంగారం, వెండి ధరలకు అమాంతం రెక్కలు వచ్చే అవకాశం లేకపోలేదని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. డిసెంబర్ 15తో శుభ ముహూర్తాలు ముగియనున్నాయి.
తెలంగాణలోని పలు నగరాల్లో 10 గ్రాముల పసిడి ధరలు..
నగరం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
హైదరాబాద్ | ₹1,25,080 | ₹1,14,650 | ₹93,810 |
వరంగల్ | ₹1,25,080 | ₹1,14,650 | ₹93,810 |
నిజామాబాద్ | ₹1,25,080 | ₹1,14,650 | ₹93,810 |
ఖమ్మం | ₹1,25,080 | ₹1,14,650 | ₹93,810 |
ఏపీలోని పలు నగరాల్లో 10 గ్రాముల పసిడి ధరలు..
నగరం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
విజయవాడ | ₹1,25,080 | ₹1,14,650 | ₹93,810 |
విశాఖపట్నం | ₹1,25,080 | ₹1,14,650 | ₹93,810 |
అమరావతి | ₹1,25,080 | ₹1,14,650 | ₹93,810 |
కాకినాడ | ₹1,25,080 | ₹1,14,650 | ₹93,810 |
తిరుపతి | ₹1,25,080 | ₹1,14,650 | ₹93,810 |
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
నగరం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
చెన్నై | ₹1,25,080 | ₹1,14,650 | ₹93,300 |
ముంబై | ₹1,25,080 | ₹1,14,650 | ₹93,810 |
ఢిల్లీ | ₹1,25,230 | ₹1,14,800 | ₹93,960 |
కోల్‌కతా | ₹1,25,080 | ₹1,14,650 | ₹93,810 |
కేరళం | ₹1,25,080 | ₹1,14,650 | ₹93,810 |
పుణె | ₹1,25,080 | ₹1,14,650 | ₹93,810 |
గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలుదారులు మరోసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.
ఇవి కూడా చదవండి..
అప్పీల్‌కు చెల్లించిన ప్రీ డిపాజిట్ వెనక్కు వస్తుందా..?