Share News

అక్షయ తృతీయ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

ABN , Publish Date - Apr 19 , 2026 | 07:01 AM

భారతీయ సంస్కృతిలో అక్షయ తృతీయకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ ప్రత్యేకమైన రోజున చిన్న బంగారం ముక్క కొన్నా, అది భవిష్యత్తులో అపార సంపదను తీసుకొస్తుందని నమ్ముతారు. ఇటీవలి కాలంలో పసిడి ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి.

అక్షయ తృతీయ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..
Gold Silver Price

భారతీయ సంస్కృతిలో అక్షయ తృతీయకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ ప్రత్యేకమైన రోజున చిన్న బంగారం ముక్క కొన్నా, అది భవిష్యత్తులో అపార సంపదను తీసుకొస్తుందని నమ్ముతారు. ఇటీవలి కాలంలో పసిడి ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు నెలకొన్నప్పటికీ బంగారం తన డిమాండ్‌ను నిలబెట్టుకుంటోంది. అక్షయ తృతీయ రోజైన ఈరోజు (ఆదివారం) నాడు బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం (Gold and Silver Rates).


ఈ రోజు (ఏప్రిల్ 19న) గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,55,780గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,42,800గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,55,930గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,42,950గా ఉంది. అలాగే చెన్నైలో ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,56,660గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,43,600గా ఉంది (Live Gold Rates).


మరోవైపు వెండి ధరలు కూడా స్థిరంగా కొనసాగుతున్నాయి (Silver prices today). ప్రస్తుతం హైదరాబాద్‌, విజయవాడలో కిలో వెండి ధర రూ.2.8 లక్షలుగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2.75 లక్షలుగా ఉంది. అలాగే చెన్నైలో కిలో వెండి ధర రూ.2.8 లక్షలు, బెంగళూరులో రూ.2.75 లక్షలుగా ఉంది.

గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.


ఇవి కూడా చదవండి

పది నెలల బాలుడి కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు

అభిషేక్, క్లాసెన్ హాఫ్ సెంచరీలు.. సీఎస్కే విజయ లక్ష్యం 195

Updated Date - Apr 19 , 2026 | 07:22 AM