Share News

సెక్యూరిటీ గార్డ్ మాస్టర్ ప్లాన్.. ఆశ్చర్యంతో నోరెళ్లబెడుతున్న జనం..

ABN , Publish Date - Apr 18 , 2026 | 09:36 PM

హైదరాబాద్‌లోని ఓ సొసైటీ ముందు కాపలా ఉండే ఆ నైట్ సెక్యూరిటీ గార్డ్ దోమల బెడద తట్టుకోలేక దోమ తెరను కప్పుకున్నాడు. సురాజ్ కుమార్ బౌధ్ అనే వ్యక్తి ఇందుకు సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు.

సెక్యూరిటీ గార్డ్ మాస్టర్ ప్లాన్.. ఆశ్చర్యంతో నోరెళ్లబెడుతున్న జనం..
security guard mosquito net video

హైదరాబాద్, ఏప్రిల్ 18: దేశ వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. మధ్యాహ్నం పూట ఎండలు 46 డిగ్రీల వరకు నమోదు అవుతున్నాయి. జనం బయటకు రావాలంటే భయపడిపోతున్నారు. పగటి పూట ఎండలు భయపెడుతుంటే.. రాత్రి పూట ఉక్కపోత, దోమలు భయపెడుతున్నాయి. ఫ్యాన్ ఐదులో తిరిగినా కూడా దోమలు తమ పని చేసుకుపోతున్నాయి. బయట పడుకునే వారి సంగతి చెప్పక్కర్లేదు. దోమ తెరలు వేసుకోకపోతే ఉదయానికి ఆస్పత్రి పాలుకావాల్సి వస్తుంది. పరిస్థితి అంత దారుణంగా ఉంది.


అందుకే ఓ సెక్యూరిటీ గార్డ్ మాస్టర్ ప్లాన్ వేశాడు. కుర్చీలో కూర్చుని దోమ తెరను కప్పేసుకున్నాడు. హైదరాబాద్‌లోని ఓ సొసైటీ ముందు కాపలా ఉండే ఆ నైట్ సెక్యూరిటీ గార్డ్ దోమల బెడద తట్టుకోలేక దోమ తెరను కప్పుకున్నాడు. సురాజ్ కుమార్ బౌధ్ అనే వ్యక్తి ఇందుకు సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. ‘దేశంలో సెక్యూరిటీ గార్డ్ జీవితం ఇలా ఉంటుంది. పాపం సెక్యూరిటీ గార్డ్ దోమల దెబ్బకు దోమతెర కప్పుకున్నాడు. ఆ సొసైటీ వాళ్లు ఏసీలో జీవిస్తున్నారు. కానీ, సెక్యూరిటీ గార్డు సురక్షితంగా ఉండటానికి ఎలాంటి సౌకర్యం కల్పించటం లేదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.


సురాజ్ షేర్ చేసిన ఆ వీడియోలో ఏముందంటే.. సొసైటీ గేట్ ముందు ఓ సెక్యూరిటీ గార్డ్ కుర్చీలో కూర్చుని ఉన్నాడు. అతడు తన మీద దోమ తెరను కప్పుకున్నాడు. దోమతెర లోపలినుంచి పరిసరాలను గమనిస్తున్నాడు. ఇక, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘జీవితం అందరికీ ఒకేలా ఉండదు. సొసైటీలో వాళ్లు ఏసీల్లో నిద్రపోతుంటే.. సెక్యూరిటీ గార్డు దోమలు, ఉక్కపోతతో సహజీవినం చేస్తున్నాడు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

పది నెలల బాలుడి కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు

అభిషేక్, క్లాసెన్ హాఫ్ సెంచరీలు.. సీఎస్కే విజయ లక్ష్యం 195

Updated Date - Apr 18 , 2026 | 09:49 PM