Share News

తగ్గిన బంగారం, పెరిగిన వెండి ధరలు..

ABN , Publish Date - May 19 , 2026 | 07:39 AM

అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయి. ఇటీవల వరకు వీటి ధరలు భారీగా పెరిగాయి.

తగ్గిన బంగారం, పెరిగిన వెండి ధరలు..

ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయి. ఇటీవల వరకు వీటి ధరలు భారీగా పెరిగాయి. దీంతో భవిష్యత్తులో బంగారం, వెండి కొనుగోలు చేయగలమా? అనే సందేహం సగటు జీవిని ఆలోచించేలా చేసింది. నిన్న ఉన్న ధర నేడు ఉండటం లేదు. నేటి ధర రేపు ఉండటం లేదు. అలాంటి పరిస్థితి ఏర్పడింది. అయితే భవిష్యత్తులో బంగారం, వెండి ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.


గుడ్ రిటర్న్స్ వెబ్ సైట్ ప్రకారం మంగళవారం ( మే 19) ఉదయం హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,210గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,190గా ఉంది. నగరంలో కిలో వెండి ధర రూ. 3,00,100గా ఉంది. సోమవారంతో పోలిస్తే.. బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి.


దేశ రాజధాని న్యూఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,56,360 ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,340 ఉంది. కిలో వెండి ధర రూ. 2,90,100గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,210గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాములు బంగారం ధర రూ.1,43,190గా ఉంది. కిలో వెండి రూ. 2,90,100 ఉంది. చెన్నైలో ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,60,900 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,490గా ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

అదానీకి భారీ ఊరట

అదానీ నుంచి ‘బొండాడ’కు రూ.470 కోట్ల ఆర్డర్లు

For Business News And Telugu News

Updated Date - May 19 , 2026 | 08:02 AM