Share News

అదానీ నుంచి ‘బొండాడ’కు రూ.470 కోట్ల ఆర్డర్లు

ABN , Publish Date - May 19 , 2026 | 01:56 AM

హైదరాబాద్‌కు చెందిన బొండాడ ఇంజనీరింగ్‌కు అదానీ గ్రూప్‌నకు చెందిన అదానీ గ్రీన్‌ ఎనర్జీ, అదానీ గ్రీన్‌ ఎనర్జీ సిక్స్‌ నుంచి...

అదానీ నుంచి ‘బొండాడ’కు రూ.470 కోట్ల ఆర్డర్లు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌కు చెందిన బొండాడ ఇంజనీరింగ్‌కు అదానీ గ్రూప్‌నకు చెందిన అదానీ గ్రీన్‌ ఎనర్జీ, అదానీ గ్రీన్‌ ఎనర్జీ సిక్స్‌ నుంచి రూ.469.52 కోట్ల విలువైన ఆర్డర్లు లభించాయి. ఈమేరకు గుజరాత్‌లోని ఖావ్డా వద్ద 250 మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్రాజెక్టుకు సంబంధించిన బ్యాలెన్స్‌ ఆఫ్‌ సిస్టమ్‌ (బీవోఎస్‌) ప్యాకేజీకి వస్తువుల సరఫరా, ఆన్‌సైట్‌ సేవలు అందించాల్సి ఉంటుంది. ఆర్డరును పొందిన ఎనిమిది నెలల్లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. సోమవారం బీఎ్‌సఈలో కంపెనీ షేరు 0.39 శాతం పెరిగి రూ.323.60 వద్ద ముగిసింది.

ఇవి కూడా చదవండి..

సీబీఎస్‌ఈ కీలక నిర్ణయం.. మార్కులు పెరిగితే రీ-ఎవాల్యుయేషన్ ఫీజు పూర్తిగా రీఫండ్..

ఉగ్రవాదికి బట్టతల కష్టాలు.. దాడులు చేయడానికి భారత్‌లోకి చొరబడి..

Updated Date - May 19 , 2026 | 01:56 AM