Share News

సీబీఎస్‌ఈ కీలక నిర్ణయం.. మార్కులు పెరిగితే రీ-ఎవాల్యుయేషన్ ఫీజు పూర్తిగా రీఫండ్..

ABN , Publish Date - May 18 , 2026 | 03:53 PM

సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలపై విద్యార్థుల ఆందోళనల మధ్య కేంద్ర మాధ్యమిక విద్యా మండలి (CBSE) కీలక నిర్ణయం తీసుకుంది. రీ-ఎవాల్యుయేషన్ లేదా రీ-చెకింగ్ తర్వాత విద్యార్థుల మార్కులు పెరిగితే, వారు చెల్లించిన రీ-ఎవాల్యుయేషన్ ఫీజును పూర్తిగా తిరిగి చెల్లిస్తామని బోర్డు ప్రకటించింది

సీబీఎస్‌ఈ కీలక నిర్ణయం.. మార్కులు పెరిగితే రీ-ఎవాల్యుయేషన్ ఫీజు పూర్తిగా రీఫండ్..
CBSE re-evaluation 2026

సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలపై విద్యార్థుల ఆందోళనల మధ్య కేంద్ర మాధ్యమిక విద్యా మండలి (CBSE) కీలక నిర్ణయం తీసుకుంది. రీ-ఎవాల్యుయేషన్ లేదా రీ-చెకింగ్ తర్వాత విద్యార్థుల మార్కులు పెరిగితే, వారు చెల్లించిన రీ-ఎవాల్యుయేషన్ ఫీజును పూర్తిగా తిరిగి చెల్లిస్తామని బోర్డు ప్రకటించింది (CBSE re-evaluation 2026).


ఇటీవల ప్రకటించిన 12వ తరగతి ఫలితాల తర్వాత ఆన్- స్క్రీన్ మార్కింగ్ (OSM) విధానంపై అనేక మంది విద్యార్థులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మార్కులు తగ్గాయని, కొన్ని సమాధానాలు సరిగా మూల్యాంకనం కాలేదని ఆరోపణలు రావడంతో సీబీఎస్‌ఈ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు విద్యార్థులు మూల్యాంకనం చేసిన ఆన్సర్ షీట్ స్కాన్ కాపీ కోసం రూ.100 మాత్రమే చెల్లించాలి. అంతకుముందు ఈ ఫీజు రూ.700గా ఉండేది. అలాగే మార్కుల వెరిఫికేషన్ ఫీజును రూ.500 నుంచి రూ.100కు తగ్గించారు (CBSE Class 12 rechecking).


రీ-ఎవాల్యుయేషన్ తర్వాత మార్కులు పెరిగితే ఫీజు మొత్తాన్ని పూర్తి స్థాయిలో రీఫండ్ చేస్తామని స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ సంజయ్ కుమార్ తెలిపారు (CBSE refund policy). ఈ ఏడాది దాదాపు 98 లక్షల ఆన్సర్ షీట్లు స్కాన్ చేసి డిజిటల్ రూపంలో మూల్యాంకనం చేశారు. స్కానింగ్ సమస్యల కారణంగా 13 వేలకుపైగా ఆన్సర్ షీట్లను మాన్యువల్‌గా పరిశీలించినట్లు అధికారులు వెల్లడించారు. విద్యార్థులు ముందుగా తమ స్కాన్ చేసిన ఆన్సర్ షీట్ కాపీని పరిశీలించి, తర్వాత వెరిఫికేషన్ లేదా రీ-ఎవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలని సీబీఎస్‌ఈ సూచించింది. ఈ ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది.


ఈ వార్తలనూ చదవండి:

స్టాక్ మార్కెట్‌లో ట్రంప్ కలకలం! 90 రోజుల్లో 3,700 లావాదేవీలు

ఇరాన్‌లో 134 ఏళ్ల నాటి విష్ణు దేవాలయం.. వీడియో షేర్ చేసిన అమితాబ్ బచ్చన్..

Updated Date - May 18 , 2026 | 04:28 PM