Share News

ఇరాన్‌లో 134 ఏళ్ల నాటి విష్ణు దేవాలయం.. వీడియో షేర్ చేసిన అమితాబ్ బచ్చన్..

ABN , Publish Date - May 18 , 2026 | 11:56 AM

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ నిన్న (ఆదివారం) తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ వీడియో సాంగ్ షేర్ చేశారు. ఇరాన్‌లో ఉన్న శ్రీ మహా విష్ణువు దేవాలయానికి సంబంధించిన వీడియో సాంగ్ అది.

ఇరాన్‌లో 134 ఏళ్ల నాటి విష్ణు దేవాలయం.. వీడియో షేర్ చేసిన అమితాబ్ బచ్చన్..
Iran Vishnu Temple

ఇంటర్‌నెట్ డెస్క్: బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ నిన్న (ఆదివారం) తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ వీడియో సాంగ్ షేర్ చేశారు. ఇరాన్‌లో ఉన్న శ్రీ మహా విష్ణువు దేవాలయానికి సంబంధించిన వీడియో సాంగ్ అది. ఆయన తన పోస్టులో.. ‘ఇరాన్‌లోని అబ్బాస్ బండార్‌లో పురాతన హిందూ దేవాలయం ఉంది. దాన్ని 1892లో సిటీలోని హిందూ వ్యాపారుల కోసం నిర్మించారు. ఈ పాట పర్షియన్ భాషలో ఉంది’ అని రాసుకొచ్చారు. అమితాబ్ షేర్ చేసిన ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 7 లక్షలకుపైగా మంది ఆ వీడియోను చూశారు.


గుడి నిర్మాణానికి నాలుగేళ్లు..

19 - 20వ శతాబ్దానికి చెందిన ఇరానియన్ చరిత్రకారుడు మహ్మద్ అలీ సాదిద్ అల్ సాల్తనె తన పుస్తకాలలో రాసుకున్న దాని ప్రకారం.. బ్రిటీష్ ఇండియన్ కంపెనీలో పని చేస్తున్న హిందువులు ఇరాన్‌లో శ్రీ మహా విష్ణువు గుడి కట్టుకోవడానికి 1888లో అనుమతి లభించింది. గుడి నిర్మాణం పూర్తి కావడానికి నాలుగేళ్ల సమయం పట్టింది. ఆ గుడి మొత్తం ఇరాన్ స్టైల్లో ఉంటుంది. 1979 వరకు ఆ గుడికి పెద్ద సంఖ్యలో జనం వచ్చే వారు. ఇస్లామిక్ రెవల్యూషన్ తర్వాత పెద్ద సంఖ్యలో భారతీయులు ఇరాన్ వదిలి వెళ్లిపోయారు.


ఆ గుడిని చారిత్రక కట్టడాల జాబితాలో చేర్చారు. ప్రస్తుతం ఆ గుడిలో శ్రీ మహా విష్ణువు విగ్రహంతో పాటు బుద్ధుడి విగ్రహం కూడా ఉంది. రాధాకృష్ణుల పెయింటింగ్స్ కూడా ఉన్నాయి. గుడిలోని ఓ రూములో చిన్న మ్యూజియం ఉంది. అందులో పురాతన వస్తువులు ఉన్నాయి. ఆనంద తాండవం చేస్తున్న నట రాజ స్వామి విగ్రహం మ్యూజియంలో ఉంది.


ఇవి కూడా చదవండి

500 మీటర్ల ఎత్తులో విమానాన్ని ఢీకొన్న పక్షి

తగ్గిన పసిడి, పెరిగిన వెండి.. ప్రస్తుతం రేట్స్ ఇవీ

Updated Date - May 18 , 2026 | 12:02 PM