తగ్గిన పసిడి, పెరిగిన వెండి.. ప్రస్తుతం రేట్స్ ఇవీ
ABN , Publish Date - May 18 , 2026 | 11:13 AM
దేశంలో నేడు బంగారం ధరలు మరింతగా తగ్గాయి. వెండి ధరలు మాత్రం పెరిగాయి. ప్రస్తుతం రేట్స్ ఎలా ఉన్నాయంటే..
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో మరోసారి బంగారం ధర తగ్గింది. గత వారం చివరి రెండు రోజుల్లో భారీగా తగ్గిన బంగారం ధర ఈ వారం కూడా ఇదే పంథాలో కొనసాగుతోంది. వెండి రేట్‌లో మాత్రం పెరుగుదల కనిపించింది. గుడ్ రిటర్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేడు ఉదయం 10.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,56,220కు దిగజారింది. క్రితం ముగింపుతో పోలిస్తే ధరలో రూ.710ల మేర కోత పడింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి కూడా రూ.650ల మేర తగ్గి రూ.1,43,200కు చేరుకుంది. నగరంలో కిలో వెండి ధర మాత్రం ఏకంగా రూ.10 వేల మేర పెరిగి రూ.3 లక్షల మార్కును తాకింది. విజయవాడలో కూడా ఇవే రేట్స్ కొనసాగుతున్నాయి.
దేశంలోని ఇతర ప్రధాన నగరాల విషయానికి వస్తే చెన్నైలో ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,60,910గా ఉంది. ముంబైలో రూ.1,56,220ల వద్ద, న్యూఢిల్లీలో రూ.1,56,370ల వద్ద కొనసాగుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,47,500 కాగా ముంబైలో రూ.1,43,200గా, న్యూఢిల్లీలో రూ.1,43,550గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.3 లక్షలకు పెరగ్గా ఇతర నగరాల్లో ధరలు రూ.2.9 లక్షల మార్కును తాకాయి.
గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.
ఈ వార్తలనూ చదవండి:
మార్కెట్‌లో ఈ వారమూ ఆటోపోట్లు.. ఆచితూచి అడుగేయాలంటున్న నిపుణులు