Share News

ఉగ్రవాదికి బట్టతల కష్టాలు.. దాడులు చేయడానికి భారత్‌లోకి చొరబడి..

ABN , Publish Date - May 18 , 2026 | 03:13 PM

దాడులు చేసేందుకు పాకిస్థాన్ నుంచి భారత్‌లోకి చొరబడిన లష్కరే తొయిబా ఉగ్రవాది, తన బట్టతల చికిత్స కోసం మొత్తం వాయిదా వేశాడు. గత నెలలో అరెస్టైన ఉగ్రవాది శ్రీనగర్‌లో రహస్యంగా హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) విచారణలో బయటపడింది.

ఉగ్రవాదికి బట్టతల కష్టాలు.. దాడులు చేయడానికి భారత్‌లోకి చొరబడి..
Lashkar terrorist hair transplant

దాడులు చేసేందుకు పాకిస్థాన్ నుంచి భారత్‌లోకి చొరబడిన లష్కరే తొయిబా ఉగ్రవాది, తన బట్టతల చికిత్స కోసం తన పనులు మొత్తం వాయిదా వేశాడు. గత నెలలో అరెస్టైన ఉగ్రవాది శ్రీనగర్‌లో రహస్యంగా హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) విచారణలో బయటపడింది. ఆ ఉగ్రవాది పేరు మహమ్మద్ ఉస్మాన్ జాట్ (Lashkar terrorist hair transplant).


లాహోర్‌కు చెందిన జాట్, లష్కరే తొయిబా శిక్షణ పొందిన టెర్రరిస్ట్. భారత్‌లో స్లీపర్ సెల్స్ ఏర్పాటు చేసి భవిష్యత్తు దాడులకు నెట్‌వర్క్ సిద్ధం చేయాలని అతడికి ఆదేశాలు వచ్చాయి. దీంతో అతడు అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించాడు. అయితే జాట్ కొన్నేళ్లుగా జుట్టు ఊడిపోయి బట్టతల సమస్యతో బాధపడుతున్నాడు. శ్రీనగర్ వచ్చిన తర్వాత మరో ఉగ్రవాది అబు హురాయిరా సహాయంతో చికిత్స తీసుకున్నాడు. శ్రీనగర్‌లోని ఓ క్లినిక్‌లో రహస్యంగా హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్నాడు (LeT terrorist arrested).


హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ కోసం కొన్నిసార్లు రాత్రంతా క్లినిక్‌లోనే ఉండిపోయేవాడు (Srinagar hair transplant case). అక్కడ చికిత్స పూర్తయిన తర్వాత బస్సులో పంజాబ్ చేరుకున్నాడు. ఆ సమయంలో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. విచారాణలో అతడు ఉగ్ర నెట్‌వర్క్‌కు సంబంధించిన విషయాలను వెల్లడించాడు. అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా స్లీపర్ సెల్స్‌ను, లష్కరే ఉగ్రవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


ఈ వార్తలనూ చదవండి:

స్టాక్ మార్కెట్‌లో ట్రంప్ కలకలం! 90 రోజుల్లో 3,700 లావాదేవీలు

ఇరాన్‌లో 134 ఏళ్ల నాటి విష్ణు దేవాలయం.. వీడియో షేర్ చేసిన అమితాబ్ బచ్చన్..

Updated Date - May 18 , 2026 | 03:42 PM