40 ఏటీఆర్ విమానాలకు ఫ్లై91 ఆర్డరు
ABN , Publish Date - Sep 04 , 2026 | 01:34 AM
గోవాకు చెందిన ప్రాంతీయ విమానయాన సంస్థ ఫ్లై91 తన సేవల విస్తరణ కోసం 40 కొత్త ఏటీఆర్ 72-600 టర్బో-ప్రాప్ విమానాలకు గురువారం ఆర్డరు ఇచ్చింది.
న్యూఢిల్లీ: గోవాకు చెందిన ప్రాంతీయ విమానయాన సంస్థ ఫ్లై91 తన సేవల విస్తరణ కోసం 40 కొత్త ఏటీఆర్ 72-600 టర్బో-ప్రాప్ విమానాలకు గురువారం ఆర్డరు ఇచ్చింది. ఈ ఆర్డరు విలువ సుమారు 100 కోట్ల డాలర్లు (సుమారు రూ.9,459 కోట్లు). ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రాంతీయ విమానయాన సంస్థ ఏటీఆర్ విమానాల కోసం ఇచ్చిన అతిపెద్ద ఆర్డరు ఇదే కావడం విశేషం. ఈ విమానాల డెలివరీ 2027 చివరి నుంచి ప్రారంభమవుతుందని, 2032 నాటికి అన్ని విమానాలు డెలివరీ అయ్యే అవకాశం ఉందని తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎన్‌విడియా గూటికి హగ్గింగ్ ఫేస్ స్టార్టప్
ప్రవాసుల నిధుల వెల్లువ
Read Latest Telangana News And AP News And National News
And Telugu News