అంతర్జాతీయ పరిణామాలే కీలకం!
ABN , Publish Date - Sep 30 , 2024 | 01:46 AM
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం మిశ్రమంగా కదలాడే అవకాశాలున్నాయి. సూచీలు ఇప్పటికే గరిష్ఠాలకు చేరటంతో లాభాల స్వీకరణకు ఆస్కారం కనిపిస్తోంది. చైనా ఉద్దీపన పథకం, అమెరికా, యూరప్, జపాన్ ఎకానమీ డేటా సూచీలకు దిశా నిర్దేశం చేసే వీలుంది...
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం మిశ్రమంగా కదలాడే అవకాశాలున్నాయి. సూచీలు ఇప్పటికే గరిష్ఠాలకు చేరటంతో లాభాల స్వీకరణకు ఆస్కారం కనిపిస్తోంది. చైనా ఉద్దీపన పథకం, అమెరికా, యూరప్, జపాన్ ఎకానమీ డేటా సూచీలకు దిశా నిర్దేశం చేసే వీలుంది. బెంచ్‌మార్క్ సూచీలు పెరుగుతున్నా మిడ్,స్మాల్ క్యాప్ షేర్లలో దిద్దుబాటు కనిపిస్తోంది. బలమైన ఫండమెంటల్స్ ఉన్న షేర్లు ఆకర్షణీయమైన ధరల్లో లభిస్తే కొనుగోలు చేయటం మంచిది. గత వారం మెటల్, ఆటో, పీఎ్‌సఈ, ఆయిల్ అండ్ గ్యాస్, కమోడిటీ, ఎనర్జీ రంగాల షేర్లు మంచి పనితీరును కనబరిచాయి.
స్టాక్ రికమండేషన్స్
టాటా మోటార్స్: ఆగస్టులో జీవితకాల గరిష్ఠాన్ని తాకిన తర్వాత ఈ షేరు ఒక్కసారిగా పతనబాట పట్టింది. లాభాల స్వీకరణ, నెగటివ్ వార్తలు రావటమే ఇందుకు కారణాలు. ప్రస్తుతం ఈ షేరుకు రూ.935 వద్ద కీలకమైన మద్దతు దొరికింది. గత శుక్రవారం రూ.993 వద్ద క్లోజైన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.990/970 వద్ద పొజిషన్ తీసుకుని రూ.1,150/1,200 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.950 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
టాటా స్టీల్: జీవితకాల గరిష్ఠాన్ని చేరుకున్న తర్వాత ఈ షేరు దిద్దుబాటు జరిగింది. షేరు దాదాపు 22 శాతం మేర పతనమైంది. రూ.150 స్థాయిలో మంచి కన్సాలిడేషన్ కనిపించింది. మెరుగైన ట్రేడింగ్, డెలివరీ వాల్యూమ్‌తో షేరు పుంజుకుంది. గత శుక్రవారం ఈ షేరు రూ.166 వద్ద క్లోజైంది. ఇన్వెస్టర్లు ఈ కౌంటర్‌లో రూ.165/160 స్థాయిలో పొజిషన్ తీసుకుని రూ.195/210 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.155 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
ఎన్‌ఎండీసీ: ఈ షేరుకు రూ.286 వద్ద నిరోధం ఎదురైన తర్వాత దాదాపు 30 శాతం మేర పతనమైంది. సెప్టెంబరు రెండో వారం నుంచి టర్న్ అరౌండ్ కనిపిస్తోంది. క్రమంగా వాల్యూమ్, స్ట్రెంత్ పెరుగుతోంది. గత శుక్రవారం రూ.235 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో ఇన్వెస్టర్లు రూ.230 వద్ద పొజిషన్ తీసుకుని రూ.255/280 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.225 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టు కోవాలి.
గ్రాసిమ్ ఇండస్ట్రీస్: ఈ కౌంటర్ మంచి ఆకర్షణీయంగా కనిపిస్తోంది. జూలైలో జీవితకాల గరిష్ఠాన్ని చేరిన తర్వాత 13 శాతం మేర దిద్దుబాటు కనిపించింది. అయితే మంచి స్ట్రెంత్‌తో కన్సాలిడేషన్ జరుగుతోంది. చివరి మూడు సెషన్లలో 8 శాతం మేర పెరిగింది. గత శుక్రవారం రూ.2,783 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో ఇన్వెస్టర్లు రూ.2,750 శ్రేణిలో పొజిషన్ తీసుకుని రూ.2,850/ 2,900 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.2,720 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
హెచ్‌డీఎ్‌ఫసీ లైఫ్: దాదాపు రెండున్నరేళ్ల తర్వాత ఈ షేరు జీవితకాల గరిష్ఠాల్లో కదలాడుతోంది. కీలక మద్దతు స్థాయిల వద్ద నిలదొక్కుకుంటూ పైకి వెళుతోంది. ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల నుంచి ఏ మాత్రం మద్దతు లభించినా రికార్డు స్థాయికి చేరుకోవటం ఖాయంగా కనిపిస్తోంది. గత శుక్రవారం ఈ షేరు రూ.730 వద్ద క్లోజైంది. ఇన్వెస్టర్లు ఈ కౌంటర్‌లో రూ.730/720 శ్రేణిలో పొజిషన్ తీసుకుని రూ.775/825 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.700 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
మూర్తి నాయుడు పాదం,
మార్కెట్ నిపుణులు, నిఫ్టీ మాస్టర్
+91 98855 59709
నోట్ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.