తొలి రోజే బ్యాంకులకు సెలవు..
ABN , Publish Date - Feb 01 , 2026 | 01:50 PM
ఫిబ్రవరి మాసం ఈరోజు ప్రారంభమైంది. తొలి రోజే ఆదివారం కావడంతో.. బ్యాంకులకు సెలవు. ఇక ఈ నెలలో బ్యాంకులకు మరిన్ని సెలవులు రానున్నాయి.
కొత్త ఏడాది ఇలా ప్రారంభమైందో లేదో.. అలా మొదటి మాసం జనవరి గడిచిపోయింది. ఫిబ్రవరి నెల నేటి నుంచి ప్రారంభమైంది. ఈ కొత్త మాసంలో.. తొలి రోజు అంటే ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం. ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ప్రైవేట్ బ్యాంకులకు సెలవు. దీంతో పాటు ఫిబ్రవరిలో మరికొన్ని రోజులకు బ్యాంకులకు సెలవులు ఉండనుంది.
ఫిబ్రవరి 1
ఆదివారం.. దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ రంగ, ప్రైవేట్ బ్యాంకులకు సాధారణ సెలవు దినం.
ఫిబ్రవరి 8
ఆదివారం.. దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు దినం.
ఫిబ్రవరి 14
రెండో శనివారం.. బ్యాంకులకు సాధారణ సెలవు దినం.
ఫిబ్రవరి 15
ఆదివారం.. అన్ని బ్యాంకులకు సెలవు దినం.
ఫిబ్రవరి 18
లోసర్ పండుగ సందర్భంగా.. సిక్కిం రాష్ట్రంలో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
ఫిబ్రవరి 19
ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి. ఈ సందర్భంగా మహారాష్ట్రలోని అన్ని బ్యాంకులకు సెలవు ఉండనుంది.
ఫిబ్రవరి 20
అరుణాచల్ ప్రదేశ్, మిజోరం రాష్ట్రాల అవతరణ దినోత్సవం. ఈ సందర్భంగా అక్కడి బ్యాంకులకు సెలవు ఉంటుంది.
ఫిబ్రవరి 22
ఆదివారం.. కాబట్టి దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు ఉంటుంది.
ఫిబ్రవరి 28
నాలుగో శనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు దినం.
మరోవైపు.. బ్యాంకులకు ఐదు రోజుల పనిదినాలు ఉండాలని డిమాండ్ చేస్తూ.. జనవరి 27న బ్యాంక్ ఉద్యోగులు సమ్మె చేపట్టారు. దీంతో ఆ రోజు బ్యాంకులు మూతపడ్డాయి. ఈ విషయమై ఆర్బీఐ ఇప్పటివరకూ ఏ నిర్ణయమూ తీసుకోలేదు. ఒకవేళ బ్యాంక్ ఉద్యోగ సంఘాల డిమాండ్ అమలైతే వారానికి ఐదు రోజులే బ్యాంకులు పని చేయనున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
బడ్జెట్ 2026: ఏది చౌకైనది.. ఏది ఖరీదైనది.?
బడ్జెట్ 2026: ఇన్‌కమ్ ట్యాక్స్ శ్లాబ్‌లు యథాతథం.. తగ్గనున్న కేన్సర్ మందుల ధరలు
For More Business News And Telugu News