Share News

బడ్జెట్ 2026: ఇన్‌కమ్ ట్యాక్స్ శ్లాబ్‌లు యథాతథం.. తగ్గనున్న క్యాన్సర్ మందుల ధరలు

ABN , Publish Date - Feb 01 , 2026 | 12:54 PM

ఆదాయపు పన్ను శ్లాబ్‌లు యథాతథంగానే ఉంటాయని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ట్యాక్స్‌ల్లో ఎలాంటి మార్పులూ చేయడం లేదని తెలిపారు. అలాగే సామాన్యుల సైతం ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేలా మార్పులు తీసుకొచ్చినట్టు తెలిపారు.

బడ్జెట్ 2026: ఇన్‌కమ్ ట్యాక్స్ శ్లాబ్‌లు యథాతథం.. తగ్గనున్న క్యాన్సర్ మందుల ధరలు
Income tax slabs unchanged

ఆదాయపు పన్ను శ్లాబ్‌లు యథాతథంగానే ఉంటాయని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ట్యాక్స్‌ల్లో ఎలాంటి మార్పులూ చేయడం లేదని తెలిపారు. అలాగే సామాన్యుల సైతం ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేలా మార్పులు తీసుకొచ్చినట్టు తెలిపారు. సవరించిన పన్ను రిటర్నుల దాఖలు తుది గడువును డిసెంబర్ 31 నుంచి మార్చి 31 వరకు పెంచినట్టు ప్రకటించారు(income tax slabs unchanged).


గతేడాదితో పోలిస్తే ద్రవ్యలోటు 0.1 శాతం తగ్గినట్టు మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు(income tax India). 2026-27 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును 4.3 శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. అలాగే క్యాన్సర్ రోగులు ఉపయోగించే 17 ఔషధాలపై పన్ను తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. సోలార్, లెదర్ ఉత్పత్తుల ధరలు కూడా తగ్గబోతున్నాయి. అలాగే పౌర విమానాల విడిభాగాలు, మైక్రో ఓవెన్స్‌పై కూడా పన్ను తగ్గించినట్టు ప్రకటించారు.

Updated Date - Feb 01 , 2026 | 01:56 PM