Share News

రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

ABN , Publish Date - Apr 03 , 2026 | 08:25 PM

రబీ సీజన్‌కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లు శనివారం నుంచి ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. శుక్రవారం నిడదవోలులో మంత్రి మనోహర్ విలేకర్లతో మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం1,917 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.

రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం
AP Minister N. Manohar

నిడదవోలు, ఏప్రిల్ 03: రబీ సీజన్‌కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లు శనివారం నుంచి ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. శుక్రవారం నిడదవోలులో మంత్రి మనోహర్ విలేకర్లతో మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం1,917 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. వీటి ద్వారా సుమారు 23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేస్తామని స్పష్టం చేశారు.


రైతులు తమ పంటకు సరైన ధర పొందేలా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. మొత్తం 5.40 కోట్ల గోతాలను సిద్ధం చేశామన్నారు. గోతాల సమస్య రాకుండా ఇప్పటికే మిల్లర్లతో చర్చలు జరిపామని వివరించారు. ధాన్యం రవాణా కోసం 17,200 లారీలకు జీపీఎస్ సదుపాయం కల్పించామని చెప్పారు. ఈ ఏడాది రబీ ధాన్యం కొనుగోళ్లు పారదర్శకంగా, వేగంగా జరిగేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుందన్నారు.


ధాన్యం నిల్వ, రవాణా విషయంలో ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రైతుల ఇబ్బందులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటామన్నారు. రాజధాని లేకుండా రాష్ట్రంలో అలజడుల సృష్టించాలన్నదే వైసీపీ కుట్ర అని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది పాఠశాల మధ్యాహ్న భోజనంలో స్టీమ్ రైస్ ఉండేలా ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

భారీ వడగాల్పులు.. విపత్తు నిర్వహణ సంస్థ కీలక సూచనలు

పెట్రోల్ బంకులో ఫేక్ కరెన్సీ.. అడ్డంగా దొరికిపోయిన ముఠా..

For More AP News And Telugu News

Updated Date - Apr 03 , 2026 | 09:11 PM