భారీ వడగాల్పులు.. విపత్తు నిర్వహణ సంస్థ కీలక సూచనలు
ABN , Publish Date - Apr 03 , 2026 | 07:07 PM
రాష్ట్రంలోని పలు మండలాల్లో శనివారం భారీ వడగాల్పులు, వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు.
అమరావతి, ఏప్రిల్ 03: రాష్ట్రంలోని పలు మండలాల్లో శనివారం భారీ వడగాల్పులు, వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. రాష్ట్రంలోని 73 మండలాల్లో భారీ వడగాల్పులు, 17 మండలాల్లో వడగాల్పులు.. ఆదివారం (05-04-2026) 32 మండలాల్లో భారీ వడ గాల్పులు, 21 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వివరించారు. ఈ నేపథ్యంలో ఎండ తీవ్రత సైతం పెరుగుతుందన్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రజలకు సూచించారు.
శనివారం (04-04-26) శ్రీకాకుళం జిల్లాలో16, విజయనగరం 24, పార్వతీపురం మన్యం 15, అల్లూరి 3, పోలవరం 9, అనకాపల్లి 2, కాకినాడ 3, తూర్పుగోదావరిలో 1 మండలాల్లో భారీ వడగాల్పులు వీచే అవకాశం ఉందని వివరించారు. శ్రీకాకుళం 2, పోలవరం 2, అనకాపల్లి 1, కాకినాడ 2, తూర్పుగోదావరి 3, ఏలూరు 4, ఎన్టీఆర్ 1, పల్నాడు 2 మండలాలలో వడగాల్పులు ప్రభావం చూపుతాయన్నారు.
శుక్రవారం మన్యం (జి) భామినిలో 41.8°సి, చిత్తూరు(జి) రాయలపేటలో 41.4°సి, అనకాపల్లి(జి) నాతవరంలో 40.9°సి, శ్రీకాకుళం(జి) జి.సిగడాంలో 40.5°సి, నంద్యాల (జి) ఆలమూరు, కడప(జి) బద్వేల్‌లో 40.4°సి, ఏలూరు(జి) ధర్మాజీ గూడెం, తిరుపతి(జి) రేణిగుంట, విజయనగరం(జి) రాజాంలో 40.3°సి, కృష్ణా(జి) కంకిపాడులో 40.1°సి, కర్నూలు(జి) తోవి 40°సి చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వివరించారు.
వడగాల్పులు వీచనున్న నేపథ్యంలో మహిళలు, పిల్లలు, వృద్దులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల సంస్థ ఎండీ విజ్ఞప్తి చేశారు. డీహైడ్రేట్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వారికి సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పాత పేరు.. కొత్త అజెండాతో ప్రజల ముందుకు వస్తా: కల్వకుంట్ల కవిత
రాజధాని అమరావతికి.. త్వరలో పిన్‌కోడ్
For More AP News And Telugu News