Share News

పోలవరం పూర్తయితే.. ఏపీతోపాటు ఇతర రాష్ట్రాలకు లబ్ధి: కేంద్ర మంత్రి

ABN , Publish Date - Jul 16 , 2026 | 09:59 PM

పోలవరం ప్రాజెక్టు పూర్తయితే కేవలం ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా లబ్ధి చేకూరుతుందని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి బి. శ్రీనివాస్ వర్మ తెలిపారు.

పోలవరం పూర్తయితే.. ఏపీతోపాటు ఇతర రాష్ట్రాలకు లబ్ధి: కేంద్ర మంత్రి
Central Minister Srinivas Verma

రాజమండ్రి, జులై 16: పోలవరం ప్రాజెక్టు పూర్తయితే కేవలం ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా లబ్ధి చేకూరుతుందని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి బి. శ్రీనివాస్ వర్మ తెలిపారు. పోలవరం - మోడీ వరం పేరుతో బీజేపీ నేతలు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్ట్‌ను వారు సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టును సందర్శించడం వల్ల చాలా సంతృప్తి కలిగిందని చెప్పారు.

పోలవరం ప్రాజెక్టుకు బీజేపీకి విడదీయరాని అనుబంధం ఉందని పేర్కొన్నారు. కేంద్రం పెద్ద ఎత్తున నిధులు అందిస్తూ.. పోలవరం ప్రాజెక్ట్‌ను త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తుందని అన్నారు. పోలవరం ప్రాజెక్టుపై ప్రధాని నరేంద్ర మోదీతోపాటు బీజేపీకి ఎంతో చిత్తశుద్ధి ఉందని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు.


పోలవరం ప్రాజెక్ట్‌కు బీజేపీకి అనుబంధం: బీజేపీ నేతలు

రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను పూర్తిచేసే దిశగా పనులు కొనసాగుతున్నాయని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టుకి బీజేపీకి మంచి అనుబంధం ఉందని గుర్తు చేశారు. పోలవరం సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. విభజన చట్టంలో బిల్లు ద్వారా ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపామని గుర్తు చేశారు. ఆంధ్ర ప్రాంతానికి నరేంద్ర మోదీ గారి వరం.. పోలవరం అని అభివర్ణించారు.


పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నిధులన్నీ కేంద్రం నుంచి అందిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వంలో అవగాహన లేని మంత్రులు ఉండటం వల్ల ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరిగిందని విమర్శించారు. ఎన్డీఏ అధికారంలోకి రాగానే సమస్యలను అధిగమించి శరవేగంగా పనులు చేస్తున్నామని వివరించారు. ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో ఎన్నో టూరిస్ట్ ప్రాంతాలు ఉన్నాయని తెలిపారు. పాపికొండలు, పట్టిసీమ శివాలయం, గండి పోచమ్మ ఆలయం ఉన్నాయని తెలిపారు.


సుమారు 500 ఎకరాల భూమిని టూరిజం కోసం కేటాయించాలని అనుకుంటున్నామని చెప్పారు. వాటన్నింటినీ అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులో ఉంచుతామని స్పష్టం చేశారు. గండి పోచమ్మ ఆలయాన్ని సందర్శించి ఆమె ఆశీర్వాదం తీసుకున్నామని చెప్పారు. ఆ గండి పోచమ్మ ఉండడం వల్ల ఈ ప్రాంతంలో ఎప్పుడు గండ్లు పడలేదని అన్నారు. అమ్మవారి సెంటిమెంట్‌ను స్థానిక గిరిజనుల మనోభావాలను కచ్చితంగా పరిరక్షిస్తామని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రాజధాని అసైన్డ్ భూముల కేసులో చంద్రబాబు, నారాయణకు హైకోర్టులో ఊరట

అల్పపీడన ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు..!

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 16 , 2026 | 10:13 PM