Share News

రాజధాని అసైన్డ్ భూముల కేసులో చంద్రబాబు, నారాయణకు హైకోర్టులో ఊరట

ABN , Publish Date - Jul 16 , 2026 | 09:21 PM

టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, పి. నారాయణపై వైసీపీ ప్రభుత్వం పెట్టిన కేసులు రాజకీయ కక్ష సాధింపేనని ఏపీ హైకోర్టు వెల్లడించింది. గురువారం రాజధాని అసైన్డ్ భూముల వ్యవహారంలో హైకోర్టు విస్పష్టమైన తీర్పు వెలువరించింది.

రాజధాని అసైన్డ్ భూముల కేసులో చంద్రబాబు, నారాయణకు హైకోర్టులో ఊరట
AP High Court

అమరావతి, జులై 16: టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, పి. నారాయణపై వైసీపీ ప్రభుత్వం పెట్టిన కేసులు రాజకీయ కక్ష సాధింపేనని ఏపీ హైకోర్టు వెల్లడించింది. గురువారం రాజధాని అసైన్డ్ భూముల వ్యవహారంలో హైకోర్టు విస్పష్టమైన తీర్పు వెలువరించింది. పరిపాలనా పరమైన నిర్ణయాలకు నేరపూరిత చర్యలను ఆపాదించడానికి వీలు లేదని ఈ సందర్భంగా స్పష్టం చేసింది. అలా చేస్తే ప్రజాస్వామ్యం మనుగడే ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. చట్ట నిబంధన అనుసరించే జీవో నంబర్ 141 తీసుకొచ్చారని వివరించింది.


జీవో వల్ల నష్టపోయామని రైతులు ఎవరు కోర్టును ఆశ్రయించ లేదని వివరించింది. ఏపీ సీఆర్డీఏ చట్టం ప్రకారం తీసుకున్న నిర్ణయాలన్నింటికీ చట్టపరమైన రక్షణ ఉంటుందని స్పష్టం చేసింది. ప్రాసిక్యూట్ చేయడాన్ని చట్టంలోని సెక్షన్ 146 నిషేధిస్తుందని తెలిపింది. చంద్రబాబు, మంత్రి నారాయణలను యాంత్రికంగా, దౌర్జన్య పూరితంగా నిందితులుగా చేర్చారని వివరించింది.


ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదులో దురుద్దేశం తప్ప, ప్రజాప్రయోజనం లేదని స్పష్టం చేసింది. పిటిషనర్లపై మోపిన ఆరోపణలన్నీ నిరాధరమైనవే అని ఏపీ హైకోర్టు వెల్లడించింది. అందువల్లే పిటిషన్‌ను కొట్టివేస్తున్నామని ప్రకటించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని అసైన్డ్ భూముల వ్యవహారంలో చంద్రబాబు, నారాయణలపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసిన విషయం విదితమే.


ఈ వార్తలు కూడా చదవండి..

అల్పపీడన ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు..!

సైబర్ నేరాలే భవిష్యత్తులో అతిపెద్ద సవాల్: డీజీపీ సీవీ ఆనంద్

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 16 , 2026 | 09:35 PM