సామాన్యుడిలా తహసీల్దార్ ఆఫీస్‌కు పోలవరం ఎమ్మెల్యే..
ABN , Publish Date - Sep 15 , 2026 | 01:21 PM
ఏలూరు జిల్లాలోని బుట్టాయగూడెం తహసీల్దార్ కార్యాలయంలో సామాన్యుడిలా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆకస్మికంగా పర్యటించారు.
ఏలూరు, సెప్టెంబర్ 15: జిల్లాలోని బుట్టాయగూడెం తహసీల్దార్ కార్యాలయంలో సామాన్యుడిలా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆకస్మికంగా పర్యటించారు. ఓ రిటైర్డ్ టీచర్ స్థల వివాదానికి సంబంధించి కొన్ని రోజులుగా బుట్టాయిగూడెం తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో విసుగు చెందిన ఆయన.. ఎమ్మెల్యే బాలరాజును ఆశ్రయించారు. వెంటనే రంగంలోకి దిగిన ఎమ్మెల్యే.. సామాన్యుడిలా తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లారు.
ప్రజలకు అందుతున్న రెవెన్యూ సేవలను, అధికారుల పనితీరును ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు. సామాన్య ప్రజలకు అధికారులు అందుబాటులో ఉంటున్నారా? సేవలు సకాలంలో అందుతున్నాయా లేదా అంటూ ఆరా తీశారు. గంటపాటు కార్యాలయంలోనే ఉండి ప్రతి అంశాన్ని నిశితంగా గమనించారు. రెవెన్యూ కార్యాలయాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందించాలని అధికారులకు ఎమ్మెల్యే బాలరాజు సూచనలు చేశారు.
ఇవి కూడా చదవండి...
ఏపీపీఎస్సీ గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల
చంపేస్తానంటూ బెదిరింపులు.. నెల్లూరులో రెచ్చిపోయిన వైసీపీ రౌడీ మూకలు
Read Latest AP News And Telugu News