లారీ ఢీకొనడంతో ముక్కలైన ట్రాక్టర్..
ABN , Publish Date - Apr 11 , 2026 | 12:44 PM
ఏలూరు జిల్లాలో ఆగి ఉన్న ట్రాక్టర్‌ను లారీ ఢీకొట్టింది. అదృష్టవశాత్తు ట్రాక్టర్ డ్రైవర్ లేకపోవడంతో ప్రమాదం తప్పినట్లైంది.
ఏలూరు జిల్లా, ఏప్రిల్ 11: ఏలూరు జిల్లా కైకలూరులో ఘోర ప్రమాదం తప్పింది. ఆగి ఉన్న ట్రాక్టర్‌ను వేగంగా దూసుకొచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ తునాతునకలైంది. కైకలూరు మండలం పల్లెవాడ సమీపంలో జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. మాచర్ల నుంచి నిడదవోలుకు ధాన్యం లోడుతో వెళ్తున్న AP39 K 1399 లారీ.. పల్లెవాడ సమీపంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న ఏపీ 27 సిహెచ్ 0221 ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. లారీ డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు.
లారీ ఢీకొట్టడంతో ట్రాక్టర్ రెండు పల్టీలు కొట్టి ముక్కలైంది. ఈ ఘటనలో ట్రాక్టర్ పూర్తిగా ధ్వంసమైనట్లు స్థానికులు తెలిపారు. అయితే ఆ సమయంలో డ్రైవర్ ట్రాక్టర్‌పై లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఒక్కసారిగా ట్రాక్టర్‌ను లారీ ఢీకొనడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ట్రాక్టర్ డ్రైవర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి...
అమరావతిపై పనులపై వైసీపీవి అన్నీ తప్పుడు ప్రచారాలే: మంత్రి నారాయణ
మహిళలు, బాలికలపై దాడులు చేస్తే చర్యలు తప్పవు: సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telugu News