Share News

చంద్రబాబు, ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా ఆవిష్కరించనున్న తొలి నాన్ జీఎంఓ పాప్‌కార్న్ హైబ్రిడ్ వంగడం

ABN , Publish Date - Aug 23 , 2026 | 09:28 PM

భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌తో కలిసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏలూరు జిల్లాలో సోమవారం పర్యటించనున్నారు. ముసునూరులో జరిగే కార్యక్రమంలో దేశంలో తొలి నాన్ జెనెటికల్లీ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ (జీఎంఓ) పాప్‌కార్న్ మెయిజ్ హైబ్రిడ్ విత్తనాన్ని వీరు ఆవిష్కరిస్తారు.

చంద్రబాబు, ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా ఆవిష్కరించనున్న తొలి నాన్ జీఎంఓ పాప్‌కార్న్ హైబ్రిడ్ వంగడం

అమరావతి, ఆగస్టు 23: భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌తో కలిసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏలూరు జిల్లాలో సోమవారం పర్యటించనున్నారు. ముసునూరులో జరిగే కార్యక్రమంలో దేశంలో తొలి నాన్ జెనెటికల్లీ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ (జీఎంఓ) పాప్‌కార్న్ మెయిజ్ హైబ్రిడ్ విత్తనాన్ని వీరు ఆవిష్కరిస్తారు. దీంతో జన్యు పరంగా మార్పు చెందని మొక్కజొన్న కొత్త వంగడం విడుదల చేస్తారు. ముసునూరులో గౌర్మెట్ పాప్‌కార్నికా ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు.


రైతులకు విలువ జోడించే వ్యవసాయ నమూనాకు ముసునూరు వేదిక కానుంది. పాప్‌కార్న్ మెయిజ్ సాగుతో వేలాది మంది రైతులతో ఈ సంస్థలో భాగస్వామ్యం ఏర్పడనుంది. ముసునూరులోని ప్లాంట్ ఆసియాలోనే అతిపెద్ద పాప్‌కార్న్ ప్రాసెసింగ్ కేంద్రాల్లో ఒకటిగా ఖ్యాతి పొందింది. దేశవ్యాప్తంగా సినిమా థియేటర్లకు పాప్‌కార్న్ సరఫరాలో గౌర్మెట్ పాప్‌కార్నికా కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.


సోమవారం ఉదయం 10.15 గంటలకు ఏలూరు జిల్లాలోని కాట్రేనిపాడుకు సీఎం చంద్రబాబు చేరుకుంటారు. ఉదయం 10.45 గంటలకు కాట్రేనిపాడులో ఉపరాష్ట్రపతికి గవర్నర్‌ అబ్దుల్ నజీర్‌తో కలిసి సీఎం చంద్రబాబు స్వాగతం పలుకుతారు. అనంతరం హైబ్రిడ్ విత్తన ఆవిష్కరణ కార్యక్రమంలో వారు పాల్గొంటారు. మధ్యాహ్నం 1.20 గంటలకు వెలగపూడిలోని సచివాలయానికి సీఎం చంద్రబాబు చేరుకుంటారు.


వార్తలు కూడా చదవండి..

బాపట్ల జిల్లాలో కోతకు గురైన సముద్ర తీరం.. అప్రమత్తమైన అధికారులు

ఆ కారణంతోనే యూఎస్ పర్యటనకు అనుమతి నిరాకరించింది: సీఎం రేవంత్ రెడ్డి

For More AP News And Telugu News

Updated Date - Aug 23 , 2026 | 09:40 PM