బాపట్ల జిల్లాలో కోతకు గురైన సముద్ర తీరం.. అప్రమత్తమైన అధికారులు
ABN , Publish Date - Aug 23 , 2026 | 08:09 PM
బాపట్ల జిల్లా పొట్టిసుబ్బయ్యపాలెంలో సముద్రం కోతకు గురైంది. శనివారం రాత్రి నుండే విపరీతంగా ఏర్పడిన అలల తాకిడికి ఆదివారం ఉదయం సముద్రంలో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పొట్టిసుబ్బయ్య పాలెం కాలువ వద్ద నుంచి కఠారిపాలెం వరకు సుమారు 2 కిలో మీటర్లు పొడవు, అలాగే 20 మీటర్లు దూరం నుండి కోత ఏర్పడింది.
సుమారు 2 కిలో మీటర్లు పొడవున 10 అడుగుల లోతు కోత
అప్రమత్తమై జాగ్రత్త చర్యలు చేపట్టిన అధికారులు
పొట్టిసుబ్బయ్యపాలెంలో పర్యాటకులను వెనక్కి పంపిన వైనం
చీరాల, ఆగస్టు 23: బాపట్ల జిల్లా పొట్టిసుబ్బయ్యపాలెంలో సముద్రం కోతకు గురైంది. శనివారం రాత్రి నుండే విపరీతంగా ఏర్పడిన అలల తాకిడికి ఆదివారం ఉదయం సముద్రంలో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పొట్టిసుబ్బయ్య పాలెం కాలువ వద్ద నుంచి కఠారిపాలెం వరకు సుమారు 2 కిలో మీటర్లు పొడవు, అలాగే 20 మీటర్లు దూరం నుండి కోత ఏర్పడింది. ఈ క్రమంలో మోకాళ్ల లోతు తరువాత నుంచి అవతలికి ఒక్కసారిగా సుమారు 10 అడుగుల లోతు కనిపించింది. గజ ఈతగాళ్లు విషయం గ్రహించి అధికారులకు సమాచారం అందించడంతో వేటపాలెం తహసీల్దార్ గీతారాణి, మెరైన్ సిఐ రమేశ్ బాబు సిబ్బందితో కలిసి హుటాహుటిన తీర ప్రాంతానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్లును పంపి క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ క్రమంలో ఉదయం నుంచే ప్రమాద ప్రాంతంలో పర్యాటకులను అనుమతించలేదు.

వెనుదిరిగిన పర్యాటకులు
వారాంతం కావడంతో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ఎప్పటిలాగే పర్యాటకులు భారీగా తరలి వచ్చారు. చిన్న, పెద్ద తేడా లేకుండా అంతా తీర ప్రాంతానికి చేరుకున్నారు. అయితే అప్పటికే భద్రత చర్యల్లో భాగంగా అధికారులు వారిని అనుమతించలేదు. దీంతో నిరాశగా అక్కడి నుంచి వారు వెనుదిరిగారు. అయితే కొంతమంది రామాపురం, వాడరేవు, సూర్యలంక వైపుకు వెళ్లాల్సి వచ్చింది. అయితే అధికారులు అప్రమత్తం కారణంగా ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఇప్పటికే మెరైన్, రెవెన్యూ సిబ్బంది గజ ఈతగాళ్లుతో సహా గస్తీలో ఉన్నారు. సోమవారం కూడా మరోసారి పరిశీలిస్తామని అధికారులు చెప్పారు.

వార్తలు కూడా చదవండి..
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో జనసేన.. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా శ్రీనివాసరావు
ఆ కారణంతోనే యూఎస్ పర్యటనకు అనుమతి నిరాకరించింది: సీఎం రేవంత్ రెడ్డి
For More AP News And Telugu News