Share News

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో జనసేన.. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా శ్రీనివాసరావు

ABN , Publish Date - Aug 23 , 2026 | 04:38 PM

తెలంగాణలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై జనసేన ఫోకస్ పెట్టింది. ఇతర పార్టీల కంటే ముందుగానే అభ్యర్థిని ప్రకటిస్తూ ఎన్నికల సమరానికి సిద్ధమైంది. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ గడల శ్రీనివాసరావును జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటన చేశారు..

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో జనసేన.. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా శ్రీనివాసరావు
Telangana MLC Election

హైదరాబాద్, ఆగస్టు 23: తెలంగాణలో రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు జనసేన పార్టీ ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి డాక్టర్ గడల శ్రీనివాసరావును అభ్యర్థిగా ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న ఎన్నికలకు ఇతర పార్టీల కంటే ముందుగానే అభ్యర్థిని ప్రకటించడం ద్వారా జనసేన రాజకీయంగా ముందడుగు వేసింది. గతంలో వైద్య, ఆరోగ్య శాఖలో ఉన్నతస్థాయి బాధ్యతలు నిర్వహించిన గడల శ్రీనివాసరావును పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేయాలని పార్టీ నేతలు నేమూరి శంకర్ గౌడ్, రామ్ తాళ్లూరి జనసేన అధినేత పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. అభ్యర్థిత్వంపై పార్టీ అధిష్టానం పలు అంశాలను పరిశీలించిన అనంతరం గడల శ్రీనివాసరావు పేరును ఖరారు చేసినట్లు జనసేన ప్రకటించింది.


పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలమైన పోటీ ఇవ్వాలనే లక్ష్యంతో జనసేన ఇప్పటి నుంచే కార్యాచరణకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల పరిధిలోని పట్టభద్రుల ఓటర్లను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థి ఎంపికపై పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. వైద్య, ఆరోగ్య రంగంలో పనిచేసిన అనుభవం ఉన్న గడల శ్రీనివాసరావును బరిలోకి దింపడం ద్వారా పట్టభద్రులు, ఉద్యోగులు, యువతతో పాటు వివిధ వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే అభ్యర్థిని ప్రకటించడం ద్వారా ప్రచారం, ఓటర్ల నమోదు, పార్టీ శ్రేణుల సమన్వయం వంటి అంశాలపై ముందుగానే దృష్టి పెట్టే అవకాశం జనసేనకు లభించింది. పవన్ కల్యాణ్ ఆమోదంతో అభ్యర్థిత్వం ఖరారు కావడంతో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన పోటీపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.


వార్తలు కూడా చదవండి...

ఉద్యోగాలు, ప్రతిభకు దేశంలోనే నంబర్‌వన్ సిటీగా విశాఖ: సీఎం చంద్రబాబు

పవన్ కల్యాణ్ దిశానిర్దేశం.. శరవేగంగా అడవుల పునరుద్ధరణ కార్యక్రమం

ఈ ఏడాది మరో 3వేల టీచర్ పోస్టుల భర్తీ: మంత్రి లోకేశ్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Aug 23 , 2026 | 07:03 PM