సీఎం చంద్రబాబుకు పేరు రావడం జగన్‌కి ఇష్టం లేదు: ఏపీ మంత్రి
ABN , Publish Date - Apr 01 , 2026 | 09:23 PM
రాజధాని అమరావతి పూర్తయి సీఎం చంద్రబాబుకు పేరు రావడం వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు ఇష్టం లేదని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.
విజయనగరం, ఏప్రిల్01: రాజధాని అమరావతి పూర్తయి సీఎం చంద్రబాబుకు పేరు రావడం వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు ఇష్టం లేదని రాష్ట్ర ఎం.ఎస్.ఎం.ఈ, సెర్ప్, ఎన్.ఆర్.ఐ సాధికారత, సంబంధాల శాఖా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు లోక్‌సభలో బుధవారం ఆమోదం పొందింది. ఈ నేపథ్యంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విజయనగరంలో స్పందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజధానిపై ప్రతిపక్ష నేతకు నిర్దిష్టమైన విదానం లేక పోవడం దురదృష్టకరమన్నారు. నాడు మూడు రాజధానులన్న వైఎస్ జగన్.. నేడు మచిలీపట్నం-విజయవాడ-గుంటూరును కలుపుతూ మవిగన్ ఏర్పాటు చేయాలనడం ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడమే అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో.. ఏపీకి మూడు రాజధానులంటూ వైఎస్ జగన్ పల్లవి అందుకున్నారు. ఆ సమయంలో ఆ మూడు ప్రాంతాల్లో ఒక్క ఇటిక రాయితో రాజధానికి సంబంధించిన నిర్మాణం చేపట్టలేదన్న సంగతి అందరికి తెలిసిందే. అయితే తాజాగా అమరావతికి బదులుగా కొత్త రాజధానిని వైఎస్ జగన్ కొత్తగా ప్రతిపాదించారు.
బుధవారం తాడేపల్లిలో వైఎస్ జగన్ విలేకర్లలో మాట్లాడుతూ.. విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు ప్రాంతాన్ని రాజధానిగా చేయాలన్నారు. ఈ మూడు నగరాల మధ్య దూరాన్ని వివరించడంతో పాటు మవిగన్ పేరుతో రాజధాని ప్రాంతాన్ని ప్రకటించాలని వైఎస్ జగన్ సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
టీడీపీ హైకమాండ్ సీరియస్.. స్పందించిన ఎమ్మెల్యే
ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే.. కఠిన చర్యలు: కేంద్రం
For More AP News And Telugu News