తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు
ABN , Publish Date - Apr 01 , 2026 | 07:16 PM
తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగ భగ మండుతున్నాడు. ఉదయం సాధారణంగా ఉన్నా.. మధ్యాహ్నం వేళ తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.
హైదరాబాద్/ అమరావతి, ఏప్రిల్01: తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగ భగ మండుతున్నాడు. ఉదయం సాధారణంగా ఉన్నా.. మధ్యాహ్నం వేళల్లో తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ ఎండల తీవ్రతకు తోడు.. ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో ఏసీలు, ఎయిర్ కూలర్లు వేసుకుని ప్రజలు ఇళ్లలోనే ఉండిపోతున్నారు. సాయంత్రం అయితేనే కానీ ఇంటి బయటకురాలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
కడప జిల్లా పొట్టిపాడులో అత్యధికంగా 40.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై రికార్డు సృష్టించింది. అలాగే కర్నూలు జిల్లా లద్దగిరితో పాటు విజయనగరం జిల్లా నెలివాడలో సైతం 39.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. బాపట్లలో అత్యల్పంగా 34 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
మరోవైపు.. తెలంగాణలోనూ ఎండలు దంచికొడుతున్నాయి. కొత్తగూడెంలో గరిష్ఠంగా 40.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యల్పంగా 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ అతాధికారులు హెచ్చరిస్తున్నారు. ఎండల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
టీడీపీ హైకమాండ్ సీరియస్.. స్పందించిన ఎమ్మెల్యే
ఒంటిమిట్ట ఆలయం సమీపంలో అగ్నిప్రమాదం.. స్పందించిన సిబ్బంది
For More AP News And Telugu News