Share News

విజయనగరం జిల్లాలో వైసీపీకి మరో భారీ షాక్

ABN , Publish Date - Sep 23 , 2026 | 06:01 PM

విజయనగరం జిల్లాలో వైసీపీకి వరుసగా భారీ షాక్‌లు తగులుతున్నాయి. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను టీడీపీలో చేరారు. విజయనగరం జిల్లాలో ఆయన అనుచరులుగా ముద్రపడిన పలువురు జడ్పీటీసీలు బుధవారం వైసీపీకి రాజీనామా చేశారు.

విజయనగరం జిల్లాలో వైసీపీకి మరో భారీ షాక్

విజయనగరం, సెప్టెంబర్ 23: జిల్లాలో వైసీపీకి వరుసగా భారీ షాక్‌లు తగులుతున్నాయి. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను టీడీపీలో చేరారు. విజయనగరం జిల్లాలో ఆయన అనుచరులుగా ముద్రపడిన పలువురు జడ్పీటీసీలు బుధవారం వైసీపీకి రాజీనామా చేశారు. తాజాగా చీపురపల్లి వలిరెడ్డి శిరీష, గజపతినగరం గార తవుడు, గంట్యాడ వర్రి నరసింహమూర్తి, విజయనగరం కెల్ల శ్రీనివాసరావు, కొత్తవలస నెక్కల శ్రీదేవి వైసీపీకి రాజీనామా చేశారు. అనంతరం వీరంతా టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. త్వరలో వైసీపీలో మరింత కుదుపు ఎదుర్కొంటుందని వారంతా ప్రకటించారు.


అయితే జిల్లాలో వైసీపీకి చెందిన శ్రేణులు భారీగా రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వారంతా త్వరలో టీడీపీలో చేరతారనే చర్చ సాగుతోంది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వైసీపీకీ భారీ షాక్ ఇచ్చేందుకు శ్రేణులు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. వైసీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సమీప బంధువు మజ్జి శ్రీనివాసరావు.


ప్రస్తుతం ఆయన విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఉన్నారు. ఇటీవల వైసీపీకీ ఆయన రాజీనామా చేశారు. అనంతరం రాజధాని అమరావతిలో సీఎం చంద్రబాబు సమక్షంలో మజ్జి శ్రీనివాసరావుతోపాటు ఆయన కుమార్తె టీడీపీలో చేరారు. వారిని సీఎం చంద్రబాబు కండువా కప్పి.. పార్టీలోకి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. మజ్జి శ్రీనివాసరావు వైసీపీని వీడడంతో.. జిల్లాలో వైసీపీ బలం పూర్తిగా తగ్గిపోయిందనే ఓ వాదన నడుస్తోంది.


ఇవి కూడా చదవండి..

విశాఖలో భారీ వర్షం.. అప్రమత్తమైన యంత్రాంగం

సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. సుప్రీంకోర్టులో కీలక పరిణామం

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 23 , 2026 | 06:22 PM