విజయనగరం జిల్లాలో పోలీస్ వాహనం బోల్తా.. కానిస్టేబుల్ మృతి
ABN , Publish Date - Aug 23 , 2026 | 06:01 PM
విజయనగరం జిల్లా గాజులరేగ కొండపై పోలీస్ వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ సీర వెంకటరమణ అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనలో ఎస్ఐ అశోక్‌తోపాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడ్డారు.
విజయనగరం, ఆగస్టు23: జిల్లాలోని గాజులరేగ కొండపై పోలీస్ వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ సీర వెంకటరమణ అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనలో ఎస్ఐ అశోక్‌తోపాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి చేరుకుని.. గాయపడిన వారిని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో జీపులో ఆరుగురు ఉన్నారని పోలీసులు తెలిపారు. గాజులరేగ కొండపై కేసు దర్యాప్తు నిమిత్తం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బ్రేక్ ఫెయిల్ కావడంతో జీపు పొదల్లోకి దూసుకెళ్లి బోల్తా పడిందని పోలీసులు వివరించారు.
స్పందించిన హోం మంత్రి..
ఈ ప్రమాద ఘటనపై హోం మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని జిల్లా పోలీస్ ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు. అలాగే జిల్లాకు చెందిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈ ప్రమాదంపై ఆరా తీశారు.
వార్తలు కూడా చదవండి..
శబరిమలలో తెలుగు స్వాముల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం: భానుప్రకాశ్ రెడ్డి
ఆ కారణంతోనే యూఎస్ పర్యటనకు అనుమతి నిరాకరించింది: సీఎం రేవంత్ రెడ్డి
For More AP News And Telugu News