Share News

శబరిమలలో తెలుగు స్వాముల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం: భానుప్రకాశ్ రెడ్డి

ABN , Publish Date - Aug 23 , 2026 | 04:22 PM

కేరళంలోని శబరిమలలో అయ్యప్ప స్వామి వారి దర్శనం కోసం వెళ్లే తెలుగు స్వాములు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాశ్ రెడ్డి తెలిపారు. ఆ భక్తుల సమస్యల పరిష్కారానికి తాము చిత్తశుద్ధితో పని చేస్తామన్నారు.

శబరిమలలో తెలుగు స్వాముల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం: భానుప్రకాశ్ రెడ్డి
TTD Board Members Bhanu Prakash

విజయవాడ, ఆగస్టు 23: కేరళంలోని శబరిమలలో అయ్యప్ప స్వామి వారి దర్శనం కోసం వెళ్లే తెలుగు స్వాములు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాశ్ రెడ్డి తెలిపారు. ఆ భక్తుల సమస్యల పరిష్కారానికి తాము చిత్తశుద్ధితో పని చేస్తామన్నారు. శబరిమలలో అయ్యప్ప స్వాములు ఎదుర్కొన్న సమస్యలు.. మొత్తం హిందువులు ఎదుర్కొంటున్న సమస్య లాగా చూడాలని పేర్కొన్నారు. ఆదివారం విజయవాడలో శబరిమల యాత్రకు వెళ్లే ఏపీలోని అయ్యప్ప భక్తుల సమస్యల పరిష్కారం కోసం సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ భూమి మీద పుట్టడమే మనం చేసుకున్న అదృష్టం అని తెలిపారు.


కేరళంలో భక్తులు పడుతున్న బాధలు తాను అనుభవించానని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. కేరళంలో ఉన్నది మాటల ప్రభుత్వమే కానీ చేతల ప్రభుత్వం కాదని పేర్కొన్నారు. మనం చెప్పేది వింటారు.. కానీ ఏమి చేయరని ఆ రాష్ట్ర ప్రభుత్వ తీరును ఆయన ఎండగట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానం నగదు కేవలం హైందవ కార్యక్రమాలకు మాత్రమే వినియోగించాలని తాను కోర్టుకు కూడా వెళ్లానని గుర్తు చేశారు.


తిరుమలలోని శ్రీవేంకటేశ్వర స్వామి వడ్డీ కాసుల వాడే కానీ.. వడ్డీ వసూల్ చేసే వాడు కాదన్నారు. హిందూవుల సమస్యల పోరాడడానికి రాముడు అయినా కావాలి.. పరశరాముడు అయినా కావాలని పేర్కొన్నారు. హిందూ దేవాలయాల వద్ద వ్యాపారాలు చేసే వాళ్లు.. హిందువులే ఉండాలని టీటీడీ మెంబర్ భాను ప్రకాశ్ రెడ్డి స్పష్టం చేశారు.


వార్తలు కూడా చదవండి..

ఆ కారణంతోనే యూఎస్ పర్యటనకు అనుమతి నిరాకరించింది: సీఎం రేవంత్ రెడ్డి

రాహుల్ గాంధీకి దమ్ముంటే తెలంగాణలో ‘ఛత్రోంకీ గూంజ్’ పెట్టాలి: రాంచందర్‌రావు

For More AP News And Telugu News

Updated Date - Aug 23 , 2026 | 04:28 PM