Share News

చంపేసి.. గోనెసంచిలో కుక్కేసి.. వివాహితను హత్యచేసిన ప్రియుడు

ABN , Publish Date - Sep 16 , 2026 | 06:02 AM

విజయనగరం జిల్లాలో వివాహిత హత్య ఘటన కలకలం రేపింది. పోలీసుల ప్రకారం, నిందితుడు మృతదేహాన్ని గోనెసంచిలో ఉంచి పొదల్లో పడేశాడు.

చంపేసి.. గోనెసంచిలో కుక్కేసి.. వివాహితను హత్యచేసిన ప్రియుడు
Nadipalli woman death

నెల్లిమర్ల/ పూసపాటిరేగ, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): వివాహితను ఆమె ప్రియుడే హత్యచేశాడు. ఆపై మృతదేహాన్ని గోనెసంచిలో కుక్కి ముళ్ల పొదల్లో పడేశాడు. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం నడిపల్లి గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. నడిపల్లి గ్రామానికి చెందిన లంకలపల్లి బంగారుబాబు, అదే గ్రామానికి చెందిన శీల రమ(35) మ ధ్య వివాహేతర సంబంధం ఉంది.


అయితే ఇటీవల ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఈ క్రమంలో సోమవారం భర్త బయటకు వెళ్లిన తర్వాత రమ.. బంగారుబాబు ఇంటికి వెళ్లింది. అక్కడ ఇద్దరూ గొడవపడ్డారు. కోపోద్రిక్తుడైన బంగారుబాబు ఆమెను కొట్టి మొహంపై దిండుతో అదిమి హత్య చేశాడు. తర్వాత మృతదేహాన్ని గోనెసంచిలో కుక్కి మోటారు సైకిల్‌పై తీసుకెళ్లి.. నెల్లిమర్ల మండలం సారిపల్లి సమీప పొదల్లో పడేశాడు.


ఈ వార్తలు కూడా చదవండి..

హెడ్‌ కానిస్టేబుల్‌ సాహసం
ఆర్మీ ఎంపికలో విషాదం.. రన్‌లో యువకుడి మృతి

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 16 , 2026 | 06:02 AM