Share News

మార్పు రాకుంటే చర్యలు తప్పవ్‌

ABN , Publish Date - May 06 , 2026 | 11:36 PM

ఉపాధి హామీ పనుల్లో మార్పు రాకుంటే చర్యలు తప్పవని పంచాయతీరాజ్‌, ఉపాధి హామీ జాయింట్‌ కమిషనర్‌ ఎం.శివప్రసాద్‌ హెచ్చరించారు. బుధవారం ఉల్లిభద్ర, నాగూరు పంచాయతీల్లో ఉపాధి పనులను పరిశీలించారు.

మార్పు రాకుంటే చర్యలు తప్పవ్‌

  • పంచాయతీరాజ్‌, ఉపాధి హామీ జాయింట్‌ క మిషనర్‌ శివప్రసాద్‌

గరుగుబిల్లి, మే 6(ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పనుల్లో మార్పు రాకుంటే చర్యలు తప్పవని పంచాయతీరాజ్‌, ఉపాధి హామీ జాయింట్‌ కమిషనర్‌ ఎం.శివప్రసాద్‌ హెచ్చరించారు. బుధవారం ఉల్లిభద్ర, నాగూరు పంచాయతీల్లో ఉపాధి పనులను పరిశీలించారు. అయితే పాత విధానం లోనే పనులు నిర్వహించడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీల్లో ప్రధాన చెరువుల సరిహద్దులను ముందుగా గుర్తించి.. ఆ తర్వాత అర మీటరు మేరకు ఫిట్‌లు తీయాలన్నారు. చెరువుల ఆక్రమణ సమాచారాన్ని రెవెన్యూ అధికారులకు అందించాలని ఆదేశించారు. జలధార, జల హారతి కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలన్నారు. గ్రామస్థాయిలో పూర్తిస్థాయిలో సర్వే నిర్వహించి అంచనాలు తయారు చేయాలని తెలిపారు. పనులు నిర్వహించే ముందు అధి కారులు క్షేత్రస్థాయి పరిశీలించి అనుమతులు మంజూరు చేయాలన్నారు. పనుల్లో ప్రగతి కనిపిం చకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. చెరువుల్లో తూతూ మంత్రంగా పనులు నిర్వహిస్తే సహించేది లేదన్నారు.


మ్యాజిక్‌ డ్రైనేజీపై అవగాహన

సీతానగరం(బలిజిపేట): మ్యాజిక్‌ డ్రైనేజీల నిర్మాణంపై అవగాహన ఉండాలని పంచాయతీరాజ్‌, ఉపాధి హామీ జాయింట్‌ కమిషనర్‌ ఎం.శివప్రసాద్‌ అన్నారు. పెదపెంకిలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా పారిశుధ్యం నివారణ, ఇతర సమస్యలపై దిశానిర్దేశం చేశారు. మ్యాజిక్‌ డ్రైనేజీలతో ఎక్కడికక్కడే మురుగునీరు ఇంకిపోతుందన్నారు. మురుగునీటి సరఫరా కాలువల నిర్మాణం కంటే నూతన విధానం ఎంతో మేలన్నారు. ఈ పరిశీలనలో డ్వామా పీడీ కె.రామచంద్రరావు, ఏపీడీలు తదితరులు ఉన్నారు.

Updated Date - May 07 , 2026 | 06:53 AM