Share News

పుష్ప సినిమా తరహాలో స్మగ్లింగ్.. విశాఖపట్నంలో రూ.8.98 కోట్ల బంగారం పట్టివేత

ABN , Publish Date - Oct 11 , 2026 | 12:26 PM

కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారని డీఆర్ఐ అధికారులకు సమాచారమందింది. దీంతో వారు విస్తృత తనిఖీలు చేపట్టారు.

పుష్ప సినిమా తరహాలో స్మగ్లింగ్.. విశాఖపట్నంలో రూ.8.98 కోట్ల బంగారం పట్టివేత
Gold Smuggling

విశాఖపట్నం, అక్టోబర్ 11: విశాఖపట్నంలో భారీ బంగారం స్మగ్లింగ్ ప్లాన్‌ను డీఆర్ఐ అధికారులు భగ్నం చేశారు. పుష్ప సినిమా తరహాలో స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.


కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారని డీఆర్ఐ అధికారులకు సమాచారమందింది. దీంతో వారు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో గోల్డ్ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులు విశాఖపట్నంలో పట్టుబడ్డారు. కారు సీటు కింద ప్రత్యేకంగా తయారు చేసిన సీక్రెట్ కేబిన్‌లో స్మగ్లర్లు బంగారాన్ని దాచి ఉంచినట్టు అధికారులు గుర్తించారు. అక్రమంగా తరలిస్తున్న 5,832.90 గ్రాముల స్వచ్ఛమైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.8.98 కోట్లు ఉంటుంది. ఈ బంగారాన్ని కస్టమ్స్ చట్టం కింద సీజ్ చేశామని అధికారులు తెలిపారు. అలాగే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని, దర్యాప్తు చేపట్టామని వెల్లడించారు.


ఈ వార్తలూ చదవండి

శ్రీవారికి బంగారు లాకెట్‌, ముత్యాలహారం విరాళం

13న అమరావతికి విజయ్‌

Updated Date - Oct 11 , 2026 | 12:31 PM