13న అమరావతికి విజయ్
ABN , Publish Date - Oct 11 , 2026 | 04:53 AM
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఈ నెల 13వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి వస్తున్నారు.
చంద్రబాబుతో భేటీలో చెన్నైకి తాగునీటి సరఫరాపై చర్చించే అవకాశం
అమరావతి, చెన్నై, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఈ నెల 13వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి వస్తున్నారు. ‘విజయవాడ ఉత్సవ్ 2.0’లో పాల్గొనాలంటూ ఏపీకి చెందిన పలువురు ఎంపీలు ఇటీవల విజయ్‌ను కలిసి ఆహ్వానించడంతో ఆ ఉత్సవంలో పాల్గొనేందుకు విజయ్ సిద్ధమైనట్లు తెలిసింది. అలాగే, జాతీయ సరస్ ప్రదర్శనను ఆయన తిలకించనున్నారు. ఈ సందర్భంగా సీఎంను చంద్రబాబును ఆయన మర్యాదపూర్వకంగా కలుసుకోనున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తోనూ విజయ్ భేటీ కానున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. చెన్నైకి రావాల్సిన కృష్ణా జలాల గురించి చంద్రబాబు వద్ద విజయ్ ప్రస్తావించనున్నట్లు తెలిసింది. ప్రస్తుత ఎల్‌నినో తరుణంలో చెన్నైకు మంచినీటి సరఫరాపై విజయ్ చేసే ప్రస్తావనకు చంద్రబాబు ఎలాంటి సమాధానం ఇస్తారోనన్న ఆసక్తి నెలకొంది. ఈ పర్యటనలో వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డిని కూడా విజయ్ కలిసే అవకాశం ఉందని టీవీకే వర్గాలు తెలిపాయి.
ఈ వార్తలనూ చదవండి:
ఎవరు అడ్డొచ్చినా నెట్టుకుంటూ పోతాం
దసరాలోపు 2వ విడత తల్లికి వందనం..!