విశాఖలో దారుణం.. తరగతి గదిలో కుప్పకూలిన బాలుడు
ABN , Publish Date - Aug 20 , 2026 | 03:48 PM
విశాఖలో దారుణం జరిగింది. టీచర్ కొట్టడంతో తరగతి గదిలోనే ఆరేళ్ల బాలుడు ప్రణయ్ తేజ్ కుప్పకూలిపోయాడు.
విశాఖపట్నం, ఆగస్టు 20: విశాఖలో దారుణం జరిగింది. టీచర్ కొట్టడంతో తరగతి గదిలోనే ఆరేళ్ల బాలుడు ప్రణయ్ తేజ్ కుప్పకూలిపోయాడు. విశాఖ వన్‌టౌన్ ప్రాంతంలోని లిటిల్ గార్డెన్ స్కూల్‌లో ఈ ఘటన జరిగింది. అపస్మారకస్థితిలోకి వెళ్లిన బాలుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే బాబు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో అక్కడి నుంచి చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. విషయం తెలిసిన వెంటనే తల్లిదండ్రులు, బంధువులు స్కూల్ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు.
హోంవర్క్ చేయలేదని టీచర్ మందలించడంతో పాటు దాడి చేయడం కారణంగానే ప్రణయ్ మరణించాడని బంధువులు ఆరోపిస్తున్నారు. కేజీహెచ్‌లో బాలుడి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చిన్నారిని కొట్టిన టీచర్‌తో పాటు స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
ఎస్‌సీబీఏ సీనియర్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా రవిశంకర్ ఎన్నిక
సీఎం చంద్రబాబు ఆదర్శ పాలన అందిస్తున్నారు: ఎంపీ శ్రీభరత్
Read Latest AP News And Telugu News