Share News

మంత్రి పొంగులేటికి సవాల్‌.. వివరణ ఇచ్చే వరకు కదిలేది లేదు: ఏలేటి మహేశ్వర్ రెడ్డి..

ABN , Publish Date - Aug 20 , 2026 | 01:23 PM

తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి భారీ అవినీతికి తెరలేపారని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. మంత్రి అవినీతికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని చెప్పారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌కు చేరుకుని మంత్రి చర్చకు రావాలని ఏలేటి డిమాండ్ చేశారు.

మంత్రి పొంగులేటికి సవాల్‌.. వివరణ ఇచ్చే వరకు కదిలేది లేదు: ఏలేటి మహేశ్వర్ రెడ్డి..
Alleti Maheshwar Reddy

హైదరాబాద్: తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి భారీ అవినీతికి తెరలేపారని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. మంత్రి అవినీతికి సంబంధించి అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని చెప్పారు. దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని, హౌస్ కమిటీ వేయాలని ఆయన డిమాండ్ చేశారు. అవినీతిపై చర్చకు సిద్ధమా? అంటూ మంత్రి శ్రీనివాస రెడ్డికి ఏలేటి మహేశ్వర్ రెడ్డి నిన్న (బుధవారం) సవాల్ చేశారు. తన సవాల్‌ను స్వీకరిస్తే అసెంబ్లీ మీడియా పాయింట్‌కు రావాలని కోరారు. ఈ మేరకు గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్‌కు ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేరుకున్నారు.


తన సవాల్‌ను స్వీకరించి చర్చకు రావాలని మంత్రిని ఏలేటి మరోసారి డిమాండ్ చేశారు. తాను మధ్యాహ్నం 2 గంటల వరకు ఇక్కడే ఉంటానని, శ్రీనివాస రెడ్డి రావాలని డెడ్ లైన్ విధించారు. ఈ సందర్భంగా భూభారతి, 22ఏలో అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు. ఫీనిక్స్‌, రాఘవ కన్‌స్ట్రక్షన్ సంస్థలకు భూ బదలాయింపులు జరిగాయని పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రజల భూములను లాక్కున్నారని మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. పొంగులేటి వచ్చి వివరణ ఇచ్చే వరకు తాను కదిలేది లేదని తేల్చి చెప్పారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి వివరణ ఇస్తారా? లేక పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇస్తారా? అంటూ సూటిగా ప్రశ్నించారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌కు ఎవరొచ్చినా సరే తన వద్ద ఉన్న ఆధారాలను అందిస్తానని మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

హైదరాబాద్‌లో షహజాద్ భట్టీ నెట్‌వర్క్ జాడలు

క్రమశిక్షణ కమిటీకి లేఖ రాయనున్న కొండా సురేఖ.. కూతురిని సమర్ధిస్తారా?

Updated Date - Aug 20 , 2026 | 01:30 PM