కృషి, పట్టుదల ఉంటే అన్నీ సాధ్యమే: ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్..
ABN , Publish Date - Apr 27 , 2026 | 07:10 PM
కృషి, పట్టుదల ఉంటే ప్రతిదీ సాధ్యమేనని ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ అన్నారు. మనసు ఉంటే మార్గం ఉంటుందని.. విజయాల కంటే వైఫల్యాలే ఎక్కువ నేర్పుతాయని అభిప్రాయపడ్డారు.
విశాఖపట్నం: కృషి, పట్టుదల ఉంటే ప్రతిదీ సాధ్యమేనని ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ అన్నారు. మనసు ఉంటే మార్గం ఉంటుందని.. విజయాల కంటే వైఫల్యాలే ఎక్కువ నేర్పుతాయని అభిప్రాయపడ్డారు. విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏయూ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు.
విద్యారంగంలో ఏయూ ముందుందని రాధాకృష్ణన్ తెలిపారు. దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ప్రముఖ విద్య సంస్థగా ఏయూ ఎదగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. జీవితంలో కృషి, పట్టుదలతో అన్నీ సాధించవచ్చని ఈ సందర్భంగా విద్యార్థులకు ఉప రాష్ట్రపతి సూచించారు. విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులను ప్రశంసించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంపైనా ప్రశంసలు కురిపించారు రాధాకృష్ణన్. గూగుల్‌ను విశాఖకు తీసుకురావడంపై హర్షం వ్యక్తం చేశారు. దీనికి కృషి చేసిన ఏపీ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు.
అమరావతిని శాశ్వత రాజధానిగా ప్రకటించి స్థిరమైన అభివృద్ధికి నాంది పలికారని కొనియాడారు. గడిచిన ఏడాదిలో దేశానికి వచ్చిన పెట్టుబడుల్లో 25 శాతం ఏపీ సాధించిందని రాధాకృష్ణన్ తెలిపారు. ఇది ప్రభుత్వ పారదర్శకత, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను ప్రతిబింబిస్తుందని అన్నారు. రానున్న రోజుల్లో విశాఖ గ్లోబల్ డెస్టినేషన్‌గా మారుతుందని ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఆకాంక్షించారు.
ఈ వార్తలు కూడా చదవండి
విశాఖలో ఇన్ఫోసిస్ క్యాంపస్‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
దేశంలోని అనేక యూనివర్సిటీలకు ఏయూనే దిక్సూచి: సీఎం చంద్రబాబు