విద్యార్థులు ఒత్తిడిని జయించాలి: సచిన్ టెండూల్కర్..
ABN , Publish Date - Apr 27 , 2026 | 05:56 PM
పనిపై దృష్టిపెడితే ఒత్తిడి అధిగమించే అవకాశం ఉంటుందని క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అన్నారు. నెట్స్‌లో ప్రాక్టీస్ చేయడం వల్లే తాను ఒత్తిడిని అధిగమించి క్రికెట్‌లో రాణించగలిగినట్లు చెప్పారు.
విశాఖ: పనిపై దృష్టిపెడితే ఒత్తిడి అధిగమించే అవకాశం ఉంటుందని క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అన్నారు. నెట్స్‌లో ప్రాక్టీస్ చేయడం వల్లే తాను ఒత్తిడిని అధిగమించి క్రికెట్‌లో రాణించగలిగినట్లు చెప్పారు. ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలకు సచిన్ టెండూల్కర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విశాఖలోని ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు.
ఈ రోజు తనకెంతో ప్రత్యేకమైనదని సచిన్ అన్నారు. విద్యార్థులు చదువుపై దృష్టిపెడితేనే ఒత్తిడి తగ్గుతుందని సూచించారు. తాను నెట్స్‌లో ప్రాక్టీస్ చేయడం వల్లే క్రికెట్‌లో అద్భుతాలు చేసినట్లు పేర్కొన్నారు. ఒత్తిడిని జయించడం మాములు విషయం కాదని.. చేసే పనిపై దృష్టిపెడితే అది సాధ్యమవుతుందని తెలిపారు. తన తండ్రి సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చారని, ఆయనకు చదువంటే ఎంతో ఇష్టమని సచిన్ చెప్పుకొచ్చారు.
ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు సాయంత్రం 4 గంటలకు వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. సభా ప్రాంగణం వద్దకు వచ్చిన రాధాకృష్ణన్, సచిన్‌కు చంద్రబాబు, లోకేశ్ స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛం అందించి సభా వేదిక పైకి తీసుకెళ్లారు.
ఈ వార్తలు కూడా చదవండి
మొక్కజొన్న రైతులను ఆదుకోవాలంటూ కేంద్ర మంత్రికి సీఎం చంద్రబాబు లేఖ
వైఎస్ జగన్ రెడ్డి రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. మంత్రి వ్యంగ్యాస్త్రాలు..