Share News

దేశంలోని అనేక యూనివర్సిటీలకు ఏయూనే దిక్సూచి: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Apr 27 , 2026 | 06:36 PM

దేశంలోని అనేక యూనివర్సిటీలకు ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ) నే దిక్సూచి అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. సోమవారం విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ శతాబ్ది మహోత్సవాలు ఘనంగా జరిగాయి.

దేశంలోని అనేక యూనివర్సిటీలకు ఏయూనే దిక్సూచి: సీఎం చంద్రబాబు

విశాఖపట్నం, ఏప్రిల్27: దేశంలోని అనేక యూనివర్సిటీలకు ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ) నే దిక్సూచి అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. సోమవారం విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ క్యాంపస్‌లో శతాబ్ది మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ మహోత్సవాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఏయూ.. దేశంలోనే టాప్‌-5 యూనివర్సిటీల్లో ఒకటిగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఏయూకు రూ.500 కోట్ల నిధులు ఇస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు. మరో రూ.500 కోట్లు కార్పస్‌ అభివృద్ధి కావాలని పేర్కొన్నారు. వర్సిటీలు మన చారిత్రక సంపద అని అభివర్ణించారు. వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.


ఏయూలో రూ.64 కోట్ల పనులు ప్రారంభించామని సీఎం చంద్రబాబు వివరించారు. సాధారణ వ్యక్తి.. అసాధారణ శక్తిగా మారాలని విద్యార్థులకు సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. విశాఖపట్నంకు గూగుల్ డేటా సెంటర్ వస్తోందన్నారు. ఈ నేపథ్యంలో విశాఖపట్నం ఇకనుంచి గ్లోబల్‌ సిటీ.. ఇక అన్‌స్టాపబుల్‌ అని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ యూనివర్సిటీ స్థాపించేందుకు అనేక మంది కృషి చేశారని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు.


తొలి వీసీ కట్టమంచి రామలింగారెడ్డి ఈ యూనివర్సిటీకి బలమైన పునాదులు వేశారని చెప్పారు. రెండో వీసీ సర్వేపల్లి రాధాకృష్ణన్.. దేశ రాష్ట్రపతిగా ఎదిగారని గుర్తు చేశారు. ఈ యూనివర్సిటీలో 58 దేశాలకు చెందిన విద్యార్థులు చదువుతున్నారని సీఎం చంద్రబాబు సోదాహరణగా వివరించారు. ఈ వేడుకల్లో దేశ ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, మంత్రి లోకేశ్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అంబర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం..

కవిత కొత్త పొలిటికల్ పార్టీని ఎందుకు పెట్టారో చెప్పండి కేటీఆర్: ఎమ్మెల్యే సామేల్

For More AP News And Telugu News

Updated Date - Apr 27 , 2026 | 06:43 PM