గాజువాకలో కూటమినేతల ఆత్మీయ సమావేశం.. స్థానిక ఎన్నికలపై చర్చ
ABN , Publish Date - Sep 16 , 2026 | 03:48 PM
రాష్ట్రంలో రాబోయే స్థానికసంస్థల నేపథ్యంలో జిల్లాలోని గాజువాకలో కూటమి నేతల ఆత్మీయ సమావేశం జరిగింది.
విశాఖపట్నం, సెప్టెంబర్ 16: రాష్ట్రంలో రాబోయే స్థానిక సంస్థల నేపథ్యంలో జిల్లాలోని గాజువాకలో కూటమి నేతల ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు ముఖ్యఅతిథిగా విచ్చేశారు.
అనంతరం శ్రీనివాసరావు మాట్లాడతూ.. రానున్న ఎన్నికల్లో కూటమి నేతలందరూ అభ్యర్థుల గెలుపు కోసం సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎవరికి సీట్లు కేటాయించినా.. మిగిలిన వారు మనస్ఫూర్తిగా వారి విజయానికి పాటుపడాలని కోరారు. ప్రజాశ్రేయస్సే తమ ధ్యేయం కావాలి కానీ.. పదవులే ధ్యేయంగా పని చేయకూడదన్నారు. ఒకసారి వైసీపీ అధికారంలోకి వచ్చినందుకే మన రాష్ట్రంలో అభివృద్ధి పదేళ్లు వెనక్కి వెళ్లిందన్నారు. మళ్లీ వైసీపీకి అవకాశమిస్తే.. రాష్ట్రంలో శూన్యమే మిగులుతుందన్నారు. ఈ సారి కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ.. వైసీపీకి అవకాశం ఇవ్వకూడదన్నారు.
కూటమి నేతలు పోటీ చేసిన ప్రతీ స్థానంలో వారే అత్యధిక మెజారిటీతో గెలుపోందాలని పల్లా కోరుకున్నారు. వారి గెలుపు కోసం కూటమి కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పనిచేయాలని పిలుపునిచ్చారు. స్వలాభం కోసం, ఆర్థిక ఎదుగుదల కోసం రాజకీయాలు చేయవద్దనీ.. రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని ఆయన కార్యకర్తలకు, నేతలకు సూచించారు. కాగా.. ఈ సమావేశంలో అధిక సంఖ్యలో మాజీ కార్పోరేటర్లు, కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఉద్యోగ నియామకాల వయోపరిమితి పెంపు
ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలుగు రాష్ట్రాలకు అదనపు ఇళ్ల కేటాయింపు
మహాత్మాగాంధీ మునిమనవడు కిదార్ రామ్ గోబిన్‌తో అయ్యన్నపాత్రుడు భేటీ
Read Latest AP News And Telangana News