Share News

విశాఖలో నవ వధువు ఆత్మహత్య..

ABN , Publish Date - Jun 25 , 2026 | 10:37 AM

విశాఖపట్నం పీఎం పాలెంలోని పోలీసు స్టేషన్ పరిధిలో ఆర్ హెచ్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. నవ వధువు ఆత్మహత్య చేసుకుంది.

విశాఖలో నవ వధువు ఆత్మహత్య..

విశాఖపట్నం, జూన్ 25: నగరంలో పీఎం పాలెం పోలీసుస్టేషన్ పరిధిలోని ఆర్ హెచ్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. వివాహం అయిన 40 రోజులకే యాండ్రాపు కృష్ణవేణి (25) ఆత్మహత్య చేసుకుంది. భర్త ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఏడాది మే 13వ తేదీన విజయనగరం జిల్లా మెంటాడకు చెందిన యాండ్రాపు మురళీతో కృష్ణవేణికి వివాహం అయింది. జూన్ మొదటి వారంలో పీఎం పాలెంలో వీరు ఇల్లు అద్దెకు తీసుకున్నారు.


స్థానికంగా ఓ కంపెనీలో భర్త మురళీ.. గోపాల పట్నంలోని షాపులో కృష్ణవేణి పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఎప్పటిలాగే మురళీ బుధవారం ఉదయం డ్యూటీకి వెళ్లి రాత్రికి ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్‌కు కృష్ణవేణి ఉరి వేసుకుని.. విగత జీవిగా వేలాడుతూ కనిపించింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులకు మురళీ సమాచారం అందించాడు. అలాగే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.


పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటన స్థలాన్ని ఏసీపీ అప్పలరాజుతోపాటు సీఐ పరిశీలించారు. కృష్ణవేణి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మురళీతో పాటు ఇరు కుటుంబాల వారిని పోలీసులు విచారిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గోడౌన్ కూలిన ఘటనలో 8కి చేరిన మృతులు

పాక్ గగనతలంలోకి ఎయిర్ ఇండియా విమానం..

For More AP News And Telugu News

Updated Date - Jun 25 , 2026 | 10:44 AM