డీఎస్సీపై గొడ్డలి పార్టీ అసత్య ప్రచారం: ఎమ్మెల్సీ చిరంజీవి
ABN , Publish Date - Jun 01 , 2026 | 08:50 PM
మెగా డీఎస్సీని రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహించిందని ఎమ్మెల్సీ చిరంజీవి రావు స్పష్టం చేశారు. మెగా డీఎస్సీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ వైసీపీ నాయకులపై మండిపడ్డారు.
విశాఖపట్నం, జూన్01: మెగా డీఎస్సీని రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహించిందని ఎమ్మెల్సీ చిరంజీవి రావు స్పష్టం చేశారు. మెగా డీఎస్సీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ వైసీపీ నాయకులపై మండిపడ్డారు. దగా డీఎస్సీ అని సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా డీఎస్సీ-2025పై వైసీపీ రాజకీయం చేస్తున్న నేపథ్యంలో సోమవారం విశాఖపట్నంలో అభ్యర్థుల సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ చిరంజీవి రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉద్యోగ కల్పన కోసం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ తీవ్రంగా శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. 2025 మెగా డీఎస్సీపై గొడ్డలి పార్టీ అసత్య ప్రచారాలు చేస్తుందని నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ఉద్యోగ కల్పనతో కూటమి పార్టీకి మంచి పేరు వస్తుందని వైసీపీ అసత్య ప్రచారాలకు తెర తీసిందన్నారు.
నిరుద్యోగులను మోసం చేసిన జగన్: ప్రణవ్ గోపాల్
జాబ్ క్యాలెండర్ పేరుతో వైఎస్ జగన్ నిరుద్యోగులను మోసం చేశారని వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ విమర్శించారు. వైఎస్ జగన్ నిరుద్యోగుల ద్రోహి అని అభివర్ణించారు. మెగా డీఎస్సీపై అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ జగన్‌పై మండిపడ్డారు. 2025 మెగా డీఎస్సీ పారదర్శకంగా జరిగిందని తెలిపారు. వైఎస్ జగన్‌కు దమ్ముంటే పేపర్ ఎక్కడ లీక్ అయిందో చెప్పాలని ప్రణవ్ గోపాల్ డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని ఉద్యోగ ఆంధ్రప్రదేశ్‌గా మారుస్తున్నారని చెప్పారు. సోషల్ మీడియా వేదికగా వైసీపీ కుట్రలను తిప్పికొట్టాలని నిరుద్యోగులకు ప్రణవ్ గోపాల్ పిలుపునిచ్చారు.
డీఎస్సీ అభ్యర్థుల కామెంట్స్..
మెగా డీఎస్సీపై వైసీపీ దుష్ప్రచారం చేయడం తగదని డీఎస్సీ అభ్యర్థులు స్పష్టం చేశారు. దీనిపై క్షమాపణలు చెప్పాలని వైసీపీ నేతలను వారు డిమాండ్ చేశారు. మీ రాజకీయాలు కోసం తమ భవిష్యత్తుతో ఆడుకోవద్దని వైసీపీ నేతలను కోరారు. మెగా డీఎస్సీ అత్యంత పారదర్శకంగా జరిగిందని వారు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పదవీ విరమణ వయస్సు పెంపు
బాల్క సుమన్ కేసులో మరో ట్విస్ట్
For More AP News And Telugu News