జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాస..
ABN , Publish Date - Jan 30 , 2026 | 02:02 PM
గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) కౌన్సిల్ సమావేశం శుక్రవారం రసాభాసగా మారింది. వైసీపీ, కూటమి నేత మధ్య తోపులాట చోటు చేసుకుంది..
విశాఖపట్నం, జనవరి 30: గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) కౌన్సిల్ సమావేశం శుక్రవారం రసాభాసగా మారింది. వైసీపీ, కూటమి నేత మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఒకానొక సమయంలో ఈ సమావేశంలో తీవ్ర గందరగోళం నెలకొంది. అలాంటి పరిస్థితుల్లో ఈ కౌన్సిల్ సమావేశంలో ప్రవేశపెట్టిన అంశాలకు ఎటువంటి చర్చ లేకుండా ఆమోదం తెలిపింది. దీనిపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్ల బ్యాడ్జీలు, ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. విశాఖపట్నం ఎంపీ, టీడీపీ నేత ఎం. శ్రీభరత్‌కు చెందిన గీతం కాలేజీలోని 54.79 ఎకరాల భూమిని క్రమబద్ధీకరించాలని జీవీఎంసీ కౌన్సిల్ నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని వైసీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తోంది.
ఈ భూమిని పరిశీలించేందుకు స్థానిక వైసీపీ నేతలు గురువారం గీతం కాలేజీకి వెళ్లారు. అయితే గేటు వద్ద వారిని భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో కాలేజీ వద్ద వైసీపీ నేతలు నిరసనకు దిగిన సంగతి తెలిసిందే. జగన్ ప్రభుత్వ హయాంలో గీతం కాలేజీ ప్రాంగణంలో ప్రభుత్వ భూమి ఉందంటూ.. ఆ ప్రాంతంలోని గోడను మున్సిపల్ సిబ్బంది కూల్చివేశారు. అయితే ఇటీవల ఈ భూమిని గీతం కళాశాలకు కేటాయిస్తూ జీవీఎంసీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. దీనిపై వైసీపీ నేతలు వరుసగా విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మేడారంనకు పోటెత్తిన భక్తులు.. నేడు గవర్నర్ రాక..
స్వామితో పెట్టుకుంటే భూస్థాపితమేనని చరిత్ర చెబుతోంది: మంత్రి వాసంశెట్టి
For More AP News And Telugu News