విజయ్‌కు రాజ్యసభ సీటు రావడం సంతోషంగా ఉంది: పీలా శ్రీనివాసరావు
ABN , Publish Date - Jun 07 , 2026 | 04:00 PM
ఉత్తరాంధ్ర నుంచి అతి చిన్న వయస్సులో చింతకాయల విజయ్ రాజ్యసభకు వెళ్లడం చాలా ఆనందంగా ఉందని విశాఖపట్నం మాజీ మేయర్ పీలా శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం పెందుర్తిలో టీడీపీ నేతలతో కలిసి పీలా శ్రీనివాసరావు విలేకర్లతో మాట్లాడుతూ.. టీడీపీలో కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం కల్పిస్తుందని చెప్పడానికి చింతకాయల విజయ్ ఒక మంచి ఉదాహరణ అని చెప్పారు.
విశాఖపట్నం, జూన్07: ఉత్తరాంధ్ర నుంచి అతి చిన్న వయస్సులో చింతకాయల విజయ్ రాజ్యసభకు వెళ్లడం చాలా ఆనందంగా ఉందని విశాఖపట్నం మాజీ మేయర్ పీలా శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం పెందుర్తిలో టీడీపీ నేతలతో కలిసి పీలా శ్రీనివాసరావు విలేకర్లతో మాట్లాడుతూ.. టీడీపీలో కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం కల్పిస్తుందని చెప్పడానికి చింతకాయల విజయ్ ఒక మంచి ఉదాహరణ అని చెప్పారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి చింతకాయల విజయ్‌ను రాజ్యసభకు ఎంపిక చేసినందుకు సీఎం చంద్రబాబునాయుడుతోపాటు నారా లోకేష్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఐటీడీపీ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించిన విజయ్‌కు రాజ్యసభ సీటు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి త్వరలో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఆయా స్థానాలను కూటమి ప్రభుత్వంలోని పార్టీలు చేజిక్కించుకోనుంది. దీంతో మూడు స్థానాలు టీడీపీ, ఒక స్థానం జనసేన పార్టీ ఖాతాలో పడనున్నాయి. అందుకు అభ్యర్థులను టీడీపీ, జనసేన పార్టీలు ఇప్పటికే ఎంపిక చేశాయి. టీడీపీ నుంచి చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ, సానా సతీశ్‌లను ఎంపిక చేశారు. జనసేన నుంచి లింగమనేని రమేశ్‌ను ఎంపిక చేశారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్. ఆయన ఐటీడీపీ వ్యవహారాలు చూస్తున్న సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
లోకేశ్ ఎదుగుదల చూసి ఓర్వలేకే జగన్ కుట్ర రాజకీయాలు చేస్తున్నారు: ఎమ్మెల్యే పుల్లారావు
జగన్ హయాంలో ఎన్నో అరాచకాలు, అక్రమాలకు పాల్పడ్డారు: హోంమంత్రి అనిత
Read Latest AP News And Telugu News