Share News

యారాడ బీచ్‌లో గల్లంతైన బీటెక్ విద్యార్థి మృతదేహం లభ్యం

ABN , Publish Date - Jun 14 , 2026 | 04:20 PM

యారాడ బీచ్‌లో గల్లంతైన బీటెక్ విద్యార్థి అభిషేక్ మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని అతడి కుటుంబ సభ్యులకు అందజేశారు.

యారాడ బీచ్‌లో గల్లంతైన బీటెక్ విద్యార్థి మృతదేహం లభ్యం
BTech student Abhishek dead body

విశాఖపట్నం, జూన్14: యారాడ బీచ్‌లో గల్లంతైన బీటెక్ విద్యార్థి అభిషేక్ మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని అతడి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఇటీవల 10 మంది స్నేహితులతో కలిసి అభిషేక్ యారాడ బీచ్‌లో సముద్ర స్నానానికి వెళ్లారు. ప్రమాదవశాత్తు అతడు నీటిలో పడిపోయాడు. దీంతో భారీగా ఎగసి పడుతున్న అలలు.. అతడిని సముద్రంలోకి లాక్కెళ్లాయి.


అతడిని కాపాడేందుకు స్నేహితులు ప్రయత్నించి విఫలమయ్యారు. దాంతో ఈ విషయాన్ని గాజువాక భానోజీ తోటలో నివసిస్తున్న అతడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో వారు స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే వెంటనే రంగంలోకి దిగి.. కోస్ట్ గార్డు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అప్రమత్తం చేశారు.


వారు వెంటనే హెలికాఫ్టర్ ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు. అలాగే మత్స్యకారులను కూడా రంగంలోకి దింపారు. వారంతా గాలింపు చర్యలను తీవ్రతరం చేశారు. అలా మత్స్యకారుల వలకు ఆదివారం అభిషేక్ మృతదేహం చిక్కింది. అభిషేక్ మృతితో అతడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. చేతికి అందివచ్చిన కుమారుడు ఇలా విగత జీవిగా మారడాన్ని వారు జీర్ణించుకోలేక పోతున్నారు.


అభిషేక్ తల్లిదండ్రుల స్వస్థలం ఝార్ఖండ్. అభిషేక్ తండ్రి గంగవరం పోర్టులో ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారు భానోజీ తోటలో వారు నివస్తున్నారు. మృతుని కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు భరోసా ఇచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

డబుల్ ఇంజిన్ సర్కార్‌తో దూసుకెళ్తున్న ఏపీ: మంత్రి కొండపల్లి

నన్ను తరిమికొట్టే వ్యక్తి ఈ గడ్డ మీద పుట్టలేదు: కిషన్ రెడ్డి

For More AP News And Telugu News

Updated Date - Jun 14 , 2026 | 04:34 PM