Share News

నన్ను తరిమికొట్టే వ్యక్తి ఈ గడ్డ మీద పుట్టలేదు: కిషన్ రెడ్డి

ABN , Publish Date - Jun 14 , 2026 | 03:49 PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి మరోసారి మండిపడ్డారు. ఆదివారం హైదరాబాద్‌లోని అంబర్ పేటలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ మెట్రో రైలుకు కేంద్రం నిధులు ఇచ్చిందన్నారు.

నన్ను తరిమికొట్టే వ్యక్తి ఈ గడ్డ మీద పుట్టలేదు: కిషన్ రెడ్డి
Central Minister Kishan Reddy

హైదరాబాద్, జూన్14: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి మరోసారి మండిపడ్డారు. ఆదివారం హైదరాబాద్‌లోని అంబర్ పేటలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ మెట్రో రైలుకు కేంద్రం నిధులు ఇచ్చిందన్నారు. మెట్రోకు నగదు ఇవ్వకుంటే తాము రాజీనామా చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయని మీరు రాజీనామా చేస్తారా? అంటూ సీఎం రేవంత్ రెడ్డిని కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. తనను తరిమికొడతామని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని గుర్తు చేశారు.


అయితే తాను బీఆర్ఎస్ కార్యకర్తను కాదని.. బీజేపీ కార్యకర్తనని తెలిపారు. తనను తరిమికొట్టే వ్యక్తి ఈ గడ్డ మీద ఇంకా పుట్టలేదని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ బిడ్డలను కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచిందని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఎవరు రాజీనామా చేస్తారో చెప్పాలంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిలను ఆయన డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ఆట మొదలు పెట్టారని.. 2028లో ఈ ఆటను బీజేపీ ముగిస్తుందన్నారు. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒక్కటేనని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కుండబద్దలు కొట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి..

షాదీ ముబారక్‌ పేరుతో భారీ స్కాం.. ఆర్‌ఐతోపాటు ఐదుగురి అరెస్ట్

మాజీ ఎంపీ కేశినేని నానిపై ఎంపీ కేశినేని చిన్ని సంచలన ఆరోపణలు

For More TG News And Telugu News

Updated Date - Jun 14 , 2026 | 03:54 PM