Share News

షాదీ ముబారక్‌ పేరుతో భారీ స్కాం.. ఆర్‌ఐతోపాటు ఐదుగురి అరెస్ట్

ABN , Publish Date - Jun 14 , 2026 | 03:11 PM

దొంగ పత్రాలు సృష్టించి షాదీ ముబారక్ పేరుతో భారీగా నగదు దోచుకున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. అందుకు సంబంధించి ఆర్‌ఐతో పాటు మరో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

షాదీ ముబారక్‌ పేరుతో భారీ స్కాం.. ఆర్‌ఐతోపాటు ఐదుగురి అరెస్ట్

హైదరాబాద్, జూన్ 14: దొంగ పత్రాలు సృష్టించి షాదీ ముబారక్ పేరుతో భారీగా నగదు దోచుకున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. అందుకు సంబంధించి ఆర్‌ఐతో పాటు మరో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని అత్తాపూర్‌లో దొంగ పత్రాలు సృష్టించి.. రూ. 28 లక్షల నగదు కాజేశారు. వివాహాలు కాకుండానే.. అవి జరిగిపోయినట్లు దరఖాస్తులు పరిశీలించకుండానే రెవెన్యూ ఇన్స్‌పెక్టర్ (ఆర్ఐ) వాటిని ఆమోదించేశారు. దీంతో వివాహాలు జరిగిపోయినట్లు దొంగ పత్రాలు సృష్టించారు. అలా వివాహాల కోసం 28 పత్రాలు దరఖాస్తు చేసుకోగా.. అందులో 21 వాటికి ఆర్ఐ ఆమోదం తెలిపారు.


అందుకు సంబంధించి రూ. 28 లక్షలను వీరు కాజేశారు. ఈ స్కాంలో బండ్లగూడ ఆర్ఐ కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ విషయం బహిర్గతం కావడంతో.. అధికారులు అత్తాపూర్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. దాంతో బడంగ్‌పేట్‌లో తలదాచుకున్న ఈ గ్యాంగ్‌ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మాజీ ఎంపీ కేశినేని నానిపై ఎంపీ కేశినేని చిన్ని సంచలన ఆరోపణలు

తిరుపతిలో ఒకే రాత్రి మూడు ఆలయాల్లో చోరీకి పాల్పడిన దొంగలు
For More TG News And Telugu News

Updated Date - Jun 14 , 2026 | 03:26 PM