డబుల్ ఇంజిన్ సర్కార్‌తో దూసుకెళ్తున్న ఏపీ: మంత్రి కొండపల్లి
ABN , Publish Date - Jun 14 , 2026 | 02:35 PM
కేంద్రంలో మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్‌తో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకుపోతోందని ఎంఎస్ఎంఈ, ఎన్నారై వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు.
విజయనగరం, జూన్14: కేంద్రంలో మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి సర్కార్ డబుల్ ఇంజిన్‌తో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకుపోతోందని ఎంఎస్ఎంఈ, ఎన్నారై వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. కేంద్రంలో.. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ కొలువుదీరి రెండేళ్లు అయింది. ఈ సందర్భంగా జిల్లాలోని బొండపల్లి మండలం జె గుమడంలో ప్రజా పాలన విజయోత్సవ సభను నిర్వహించారు. ఈ సభకు మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని విడగొట్టి కాంగ్రెస్ పార్టీ చేసిన నష్టంతో పాటు వైసీపీ ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చి రెండింతల నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఐదేళ్లలో రూ.10 లక్షల కోట్ల అప్పుల భారాన్ని ఆంధ్ర ప్రజలపై వైసీపీ మోపిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. వైసీపీ చేయాల్సింది రెండేళ్ల వెన్నుపోటు కార్యక్రమం కాదని.. ఐదేళ్లు ఆంధ్రాకు చేసింది సున్నా కార్యక్రమం చేయాలని ఆ పార్టీ నేతలకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ పాలనలో ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం అనేక చర్యలు పట్టిందన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపామని, అనకాపల్లిలో నూతన స్టీల్ ప్లాంట్ నిర్మాణం, భోగాపురం ఎయిర్‌పోర్ట్ సాధన, వైజాగ్‌లో గూగుల్ వంటి సంస్థలను రప్పించామని ఆయన గుర్తు చేశారు. విజయనగరం జిల్లాలో రిలయన్స్ డేటా సెంటర్‌తో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, జీడి గింజల ఇండస్ట్రీ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మాజీ ఎంపీ కేశినేని నానిపై ఎంపీ కేశినేని చిన్ని సంచలన ఆరోపణలు
తిరుపతిలో ఒకే రాత్రి మూడు ఆలయాల్లో చోరీకి పాల్పడిన దొంగలు
For More AP News And Telugu News