విద్యార్థుల జుట్టు కత్తిరింపు.. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తే మరిన్ని వివరాలు వెలుగులోకి: గంటా
ABN , Publish Date - Sep 20 , 2026 | 03:16 PM
భీమిలిలో కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం (KGBV) వసతి గృహంలో విద్యార్థుల జుట్టు కత్తిరించిన ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరగాలని స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
విశాఖపట్నం, సెప్టెంబర్ 20: భీమిలిలో కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం (KGBV) వసతి గృహంలో విద్యార్థుల జుట్టు కత్తిరించిన ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరగాలని స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఈ ఘటనపై ఆయన స్పందించారు. ఆదివారం విశాఖపట్నంలో గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఈ ఘటనపై ఇప్పటికే విద్యార్థులతో పోలీసులు మాట్లాడి వివరాలు సేకరిస్తున్నారని తెలిపారు. బయట నుంచి ఎవరైనా వచ్చి ఈ పని చేసే అవకాశం లేదని అన్నారు. వసతి గృహంలోని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తే మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
భీమిలి నీటి సమస్యపై కూడా ఆయన మాట్లాడారు. నగరంలో నెలకొన్న నీటి సమస్యను ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. హెలిప్యాడ్ వద్దే అధికారులకు, ప్రజాప్రతినిధులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారని గుర్తు చేశారు. దీంతో భీమిలికి నీటి సరఫరా చేసినట్లు వివరించారు. అవసరమైన ప్రాంతాల్లో బల్క్ వాటర్ అందించే చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. నీటి సమస్య పరిష్కారానికి చర్యలు కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పారు.
అలాగే పట్టాల పంపిణీపై మాజీ మంత్రి గంటా స్పందించారు. 2014 -19 మధ్య 60 వేల పట్టాలు ఇచ్చామని తెలిపారు. ప్రస్తుతం మరో 20 వేల పట్టాలు అందించామని వెల్లడించారు. దాదాపు 30 వేల కుటుంబాలకు భరోసా కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. బీమునిపట్నంలో కేజీబీవీలో 38 మంది విద్యార్థులు 9వ తరగతి చదువుతున్నారు. ఆ విద్యార్థినులకు రెండు గదులు కేటాయించారు. సెప్టెంబర్ 16వ తేదీ రాత్రి 12 గంటల తర్వాత విద్యార్థినులు నిద్రపోయారు. మరుసటి రోజు ఉదయం నిద్ర నుంచి లేచిన అనంతరం 20 మంది విద్యార్థులు నిద్రించిన గదిలో ఆరుగురికి,18 మంది నిద్రించిన గదిలో నలుగురు విద్యార్థులకు జడలు కత్తించారు. ఈ విషయాన్ని గుర్తించిన సదరు విద్యార్థులు.. వెంటనే హాస్టల్ సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
డీఎస్సీపై మాట్లాడే జగన్.. మద్యం వ్యవహారంపై ఎందుకు మాట్లాడరు: మంత్రి పార్థసారథి
వైసీపీ నేతల తీరు మార్చుకోకపోతే ప్రజల ఛీత్కారానికి గురికాక తప్పదు: మంత్రి నారాయణ
For More AP News And Telugu News