వివిధ ప్రాంతాల్లో చోరీలు.. ముగ్గురి అరెస్ట్
ABN , Publish Date - May 16 , 2026 | 04:43 PM
వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడ్డ ముగ్గురు అంతర్ జిల్లా దొంగలను అనకాపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.60 లక్షల విలువచేసే 450 గ్రాముల బంగారు, 250 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
అనకాపల్లి జిల్లా, మే 16: వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడ్డ ముగ్గురు అంతర్ జిల్లా దొంగలను అనకాపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.60 లక్షల విలువచేసే 450 గ్రాముల బంగారు, 250 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అనకాపల్లి జిల్లా కార్యాలయంలో ఎస్పీ తుహిన్ సిన్హా మీడియా సమావేశం నిర్వహించి పట్టుబడ్డ దొంగల వివరాలను తెలియజేశారు.
మునగపాక మండలం వెంకటాపురంలో ఈనెల 2వ తేదీన ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డ సంఘటనలో కె.కోటిపాడు మండలానికి చెందిన రొంగలి ప్రకాష్, సిరికి విజయ్ కుమార్, అక్కయ్యపాలెంకు చెందిన వినయ్ కుమార్‌లను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితులు గతంలో ఎలమంచిలి, రాంబిల్లి అనకాపల్లి, ఎస్.కోట సబ్బవరం ప్రాంతాల్లోని ఇళ్లల్లో చోరీలకు పాల్పడినట్లు వెల్లడించారు. అంతర్ జిల్లా దొంగల ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులను జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా అభినందించారు.
ఇవి కూడా చదవండి...
పీఎం, సీఎం ఆదేశాలతో ఇంధన పొదుపుపై ప్రత్యేక ఫోకస్: మంత్రి గొట్టిపాటి రవికుమార్
ప్రధాని పిలుపుతోనే ఆన్‌లైన్‌లో టీడీపీ మహానాడు: మంత్రి కొల్లురవీంద్ర
Read Latest AP News And Telugu News