Share News

విశాఖలో ఏఐజీ ఆస్పత్రి.. మంత్రి లోకేశ్ శంకుస్థాపన

ABN , Publish Date - Aug 31 , 2026 | 12:39 PM

విశాఖలో ఏఐజీ హాస్పిటల్స్‌కు మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన చేశారు. రూ.2వేల కోట్ల పెట్టుబడితో ఆస్పత్రిని నిర్మించనున్నారు. దీని ద్వారా దాదాపు 9 వేల మందికి ఉపాధి లభించనుంది.

విశాఖలో ఏఐజీ ఆస్పత్రి.. మంత్రి లోకేశ్ శంకుస్థాపన
Minister Nara Lokesh

విశాఖపట్నం, ఆగస్టు 31: విశాఖలో ఏఐజీ(AIG) హాస్పిటల్స్‌కు మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన చేశారు. రూ.2వేల కోట్ల పెట్టుబడితో ఆస్పత్రిని నిర్మించనున్నారు. దీని ద్వారా దాదాపు 9 వేల మందికి ఉపాధి లభించనుంది. పూర్తిస్థాయి నిర్మాణం పూర్తయ్యే నాటికి ఆసుపత్రి సామర్థ్యం వెయ్యి పడకలకు చేరనుంది. 9 ఎకరాల్లో ఆసుపత్రి క్యాంపస్, 2.5 ఎకరాల్లో నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేయనున్నారు. ఒకే క్యాంపస్‌లో వైద్య సేవలు, శిక్షణ, పరిశోధన, రోగులు, వారి కుటుంబ సభ్యులకు అవసరమైన అన్ని సదుపాయాలతో కూడిన కంప్లీట్ హెల్త్ కేర్‌, ఎకోసిస్టమ్‌ను నెలకొల్పనున్నారు.


మొదటి దశ నిర్మాణాలను 650 పడకల సామర్థ్యంతో 2028 అక్టోబర్ నాటికి పూర్తిచేయనున్నారు. రెండో దశ నిర్మాణాలను 350 పడకల సామర్థ్యంతో మరో రెండేళ్లలో పూర్తిచేయనున్నారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, విశాఖ ఎంపీ మతుకుమిల్లి శ్రీభరత్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే గణబాబు, ఏఐజీ హాస్పిటల్స్ వైస్ ఛైర్మన్ పీవీఎస్ రాజు పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి...

రాజేంద్రనగర్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. ఐదు బైక్‌ల దగ్ధం

వెలిగొండ ప్రాజెక్ట్ ఫేజ్‌-1ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 31 , 2026 | 01:49 PM